Amala Paul: కథ డిమాండ్‌ చేస్తే.. నగ్నంగా నటించేందుకు ఎలాంటి బెరుకు లేదు

ABN , First Publish Date - 2023-04-25T18:45:22+05:30 IST

ఆ సన్నివేశం లిప్‌లాక్‌ చేస్తేనే పండుతుంది. అందుకే అలా నటించాను. ‘ఆడై’ అనే చిత్రంలో న్యూడ్‌గా నటించాను. నా వరకు కథ డిమాండ్‌ చేస్తే

Amala Paul: కథ డిమాండ్‌ చేస్తే.. నగ్నంగా నటించేందుకు ఎలాంటి బెరుకు లేదు
Amala Paul

చిత్రపరిశ్రమలో ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు అమలాపాల్‌ (Amala Paul). దర్శకుడు ఏఎల్ విజయ్‌ (AL Vijay)తో విడాకుల అనంతరం ఫ్రీ బర్డ్‌లా చెక్కర్లు కొడుతున్న ఈ భామ.. తన వద్దకు వచ్చిన అవకాశాలలో మంచి వాటిని ఎంచుకుని నటిస్తోంది. ఈ మలయాళకుట్టి తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు చేసింది. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా ఓ చిత్రంలో లిప్‌లాక్‌ (Lip-Lock) సన్నివేశాల్లో నటించింది. ఆ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ని రీసెంట్‌గా విడుదల చేశారు. అందులో లిప్‌లాక్ సన్నివేశాలను కూడా పొందుపరిచారు. ఈ లిప్‌లాక్‌పై విమర్శలు చెలరేగడంతో.. చిత్ర ప్రమోషన్స్‌లో పాల్గొన్న అమలాపాల్.. వాటిపై వివరణ ఇచ్చారు.

‘‘ఆడుజీవితం (Aadujeevitham) స్టోరీని వినిపించే సమయంలోనే లిప్‌లాక్‌ సన్నివేశం ఉంటుందని దర్శకుడు వివరించారు. దానికి నేను ముందుగానే సమ్మతించాను. పైగా ఆ సన్నివేశం లిప్‌లాక్‌ చేస్తేనే పండుతుంది. అందుకే అలా నటించాను. ‘ఆడై’ అనే చిత్రంలో న్యూడ్‌గా నటించాను. నా వరకు కథ డిమాండ్‌ చేస్తే దుస్తులిప్పేసి నటించేందుకు కూడా ఎలాంటి బెరుకు లేదు. గతంలోనే న్యూడ్‌గా నటించిన నాకు ఈ చిత్రంలో లిప్‌లాక్‌ సన్నివేశంలో నటించడం పెద్ద విషయంగా అనిపించలేదు’’ అని అమలాపాల్‌ చెప్పుకొచ్చింది.

Amala-Heroine.jpg

‘ఆడుజీవితం’ విషయానికి వస్తే.. మలయాళ మల్టీ టాలెంటెడ్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రమిది. అతని సరసన అమలాపాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ‘ది గోట్ లైఫ్’ (The Goat Life) అంటూ రీసెంట్‌గా విడుదల చేసిన ట్రైలర్‌‌తోనే.. కథలోని మేయిన్‌ థీమ్‌పై మేకర్స్‌ క్లారిటీ ఇచ్చారు. ఊరు నుంచి బతుకుదెరువు కోసం అరబ్‌ దేశానికి వెళ్ళి అక్కడ పడరాని పాట్లు పడే ఓ యువకుడి కష్టాల గురించి ఈ సినిమాని తెరకెక్కించినట్లుగా ఈ ట్రైలర్‌ తెలియజేస్తుంది. ఏ.ఆర్ రెహమాన్‌ (AR Rahman) సంగీతం అందిస్తోన్న ఈ చిత్రాన్ని.. ఈ ఏడాది సమ్మర్‌లో పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

************************************************

*Virupaksha Director: సాయితేజ్‌కి బైక్‌ యాక్సిడెంట్‌ అయినప్పుడు.. కార్తీక్ పరిస్థితి ఏంటంటే..

*Pawan Kalyan: మైత్రీ మూవీ మేకర్స్‌పై ఐటీ దాడి.. పవన్ ప్రకటనకు అర్థమేంటి?

*Sai Dharam Tej: కోహ్లీ-పవన్, ధోని-చరణ్.. అల్లు అర్జున్‌ని అతడితో పోల్చాడేంటి?

*Upasana: అత్యంత ప్రేమాభిమానాల మధ్య ఉపాసన సీమంతం.. ఫొటోలు వైరల్

*Young Actor: ఇంట్లో ఉరి వేసుకొని నటుడి ఆత్మహత్య

*King Nagarjuna: కడుపులో ఉండగానే.. అయ్యగారి గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!

Updated Date - 2023-04-25T18:45:22+05:30 IST