Virupaksha Director: సాయితేజ్‌కి బైక్‌ యాక్సిడెంట్‌ అయినప్పుడు.. కార్తీక్ పరిస్థితి ఏంటంటే..

ABN , First Publish Date - 2023-04-25T17:02:46+05:30 IST

అంతా కంప్లీట్‌ అయి సినిమా స్టార్ట్ చేయాలనుకున్నాం. ముందురోజు అందరం కలిసి కూర్చున్నాం. అందరం ఫోన్లు సైలెంట్‌లోనో, వైబ్రేషన్‌ మోడ్‌లోనో పెట్టాం. షెడ్యూల్ డిస్కస్‌ చేస్తున్నాం. ఒకేసారి అన్ని ఫోన్లు..

Virupaksha Director: సాయితేజ్‌కి బైక్‌ యాక్సిడెంట్‌ అయినప్పుడు.. కార్తీక్ పరిస్థితి ఏంటంటే..
Director Karthik Dandu about Tej Bike Accident

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej), సంయుక్తా మీనన్ (Samyuktha Menon) హీరోహీరోయిన్లుగా నటించిన మిస్టిక‌ల్‌ థ్రిల్లర్ ‘విరూపాక్ష’ (Virupaksha). నూతన దర్శకుడు కార్తీక్ దండు (Karthik Dandu) దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (SVCC), సుకుమార్ రైటింగ్స్ (Sukumar Writings) బ్యానర్స్‌పై బాపినీడు బి.సమర్పణలో.. నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ (BVSN Prasad) ఈ చిత్రాన్ని నిర్మించారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించారు. ఏప్రిల్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బ‌స్ట‌ర్ విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్లా హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో దూసుకెళుతోంది. ఇక చిత్ర సక్సెస్‌ను పురస్కరించుకుని.. కార్తీక్ దండు తన సంతోషాన్ని తెలియజేస్తూ ప్రేక్షకులకి ధన్యవాదాలు తెలిపారు. అయితే ఈ సినిమా ప్రారంభానికి ముందు హీరో సాయిధరమ్ తేజ్‌కి జరిగిన యాక్సిడెంట్ (Sai Dharam Tej Bike Accident) సమయంలో తన పరిస్థితి ఏమిటో.. తాజాగా ఆయన చెప్పుకొచ్చారు.

దర్శకుడు కార్తీక్ దండు (Director Karthik Dandu) మాట్లాడుతూ.. ‘‘‌నేను ఫస్ట్ ‘కార్తికేయ 1’ (Karthikeya 1) రైటింగ్ విభాగంలో పనిచేశాను. ఆ తర్వాత ‘భమ్‌ బోలేనాథ్‌’ (Bham Bolenath) అని ఓ సినిమా డైరక్ట్ చేశా. నా తొలి సినిమా పెద్దగా ఆడలేదు. అందుకే రైటింగ్‌లోనో, మేకింగ్‌లోనో నిలబడిపోవాలని అనుకున్నా. 2018వరకు నేను నమ్మిన కథకు అవకాశం రాలేదు. దానికి కారణం, అప్పట్లో నేను కథ రాసుకున్నప్పుడు వేరే బడ్జెట్‌ ఉండేది. అప్పుడు నిర్మాతలు నన్ను నమ్మలేదు. ఆ టైమ్‌లో నన్ను నమ్మింది సుకుమార్‌గారే. డైరెక్టర్స్ ప్యాషన్‌, స్కిల్స్ అర్థం చేసుకోగలుగుతారనే నమ్మకం కలిగింది. నా నమ్మకం నిజమైంది. కథ ఆయనకు నచ్చింది. అందుకే స్క్రీన్‌ప్లేని ఆయన కూర్చుని మార్చారు.

Tej.jpg

మా కథకు నాలుగేళ్లు... కరోనా (Corona) కూడా బ్రేక్‌ వేసింది. అంతా కంప్లీట్‌ అయి సినిమా స్టార్ట్ చేయాలనుకున్నాం. ముందురోజు అందరం కలిసి కూర్చున్నాం. అందరం ఫోన్లు సైలెంట్‌లోనో, వైబ్రేషన్‌ మోడ్‌లోనో పెట్టాం. షెడ్యూల్ డిస్కస్‌ చేస్తున్నాం. ఒకేసారి అన్ని ఫోన్లు రింగ్‌ అయ్యాయి. సెకన్ల గ్యాప్‌లో అన్నీ మోగుతున్నాయి. ఆఫీస్‌ బోయ్‌ డోర్‌ ఓపెన్‌ చేసుకుని లోపలికి వచ్చి ‘ఒకసారి అర్జెంటుగా టీవీ పెట్టండి’ అని అన్నారు. న్యూస్‌లో హీరోగారికి యాక్సిడెంట్‌ అని వచ్చింది. 22 రోజులు సాయిధరమ్‌ తేజ్‌ (Hero Sai Dharam Tej) హాస్పిటల్‌లో ఉన్నారు. నేను ఫిజికల్‌గా తిరుగుతున్నానేగానీ, నేను కూడా కోమాలోనే ఉన్నా. హాస్పిటల్‌ నుంచి... ఆయన సేఫ్‌గానే ఉన్నారు. త్వరలోనే లేచి తిరుగుతారు అని చెప్పిన తర్వాత రిలీఫ్‌ అయ్యాను. అప్పుడు ఆ టైమ్‌ని మేకింగ్‌లో ఇంకా బెటర్‌గా ఏమేం చేయవచ్చో అని ఆలోచించి చేశాం. ఫుల్‌ మూవీకి స్టోరీ బోర్డ్ వేసుకున్నాం..’’ అని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

************************************************

*Pawan Kalyan: మైత్రీ మూవీ మేకర్స్‌పై ఐటీ దాడి.. పవన్ ప్రకటనకు అర్థమేంటి?

*Sai Dharam Tej: కోహ్లీ-పవన్, ధోని-చరణ్.. అల్లు అర్జున్‌ని అతడితో పోల్చాడేంటి?

*Upasana: అత్యంత ప్రేమాభిమానాల మధ్య ఉపాసన సీమంతం.. ఫొటోలు వైరల్

*Young Actor: ఇంట్లో ఉరి వేసుకొని నటుడి ఆత్మహత్య

*King Nagarjuna: కడుపులో ఉండగానే.. అయ్యగారి గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!

Updated Date - 2023-04-25T17:02:46+05:30 IST