Kushi Title Song: విజయ్, సమంతల మధ్య కెమిస్ట్రీ అదిరింది

ABN , First Publish Date - 2023-07-28T19:59:54+05:30 IST

విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న పాన్ ఇండియన్ చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందుతోంది. ఈ మధ్యే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 1న విడుదల కాబోతోంది. తాజాగా ఈ సినిమా నుంచి మూడో సింగిల్ టైటిల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.

Kushi Title Song: విజయ్, సమంతల మధ్య కెమిస్ట్రీ అదిరింది

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) కలిసి నటిస్తున్న పాన్ ఇండియన్ చిత్రం ‘ఖుషి’ (Kushi). శివ నిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) బ్యానర్‌పై రూపొందుతోంది. ఈ మధ్యే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 1న విడుదల కాబోతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా నిర్వహిస్తోంది చిత్రయూనిట్. మరో వైపు ప్రమోషన్స్ కూడా యమా జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన రెండు పాటలు మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా మేకర్స్ ‘ఖుషి’ థర్డ్ సింగిల్‌ను రిలీజ్ చేశారు.


టైటిల్ సాంగ్‌గా ఖుషి (Kushi) అంటూ సాగే ఈ పాట.. ఇంతకు ముందు విడుదలైన పాటల మాదిరిగానే శ్రోతలను ఆకట్టుకుంటోంది. ఈ పాటకు శివ నిర్వాణ సాహిత్యం అందించారు. హిషామ్ అబ్దుల్ వాహబ్ (Hesham Abdul Wahab) అందించిన బాణీ ఎంతో వినసొంపుగా ఉంది. ఆయనే స్వయంగా ఈ పాటను ఆలపించారు. ఇక ఇందులో విజువల్స్ మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా ఉన్నాయి. మరీ ముఖ్యంగా విజయ్, సమంతల మధ్య మ్యారేజ్ సన్నివేశాన్ని చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది. ఈ పాటలో కూడా విజయ్, సమంతల కెమిస్ట్రీని (Chemistry Between Vijay and Samantha) చూస్తుంటే.. చూసే వారికి యమా ఖుషిగా అనిపిస్తోంది. ప్రస్తుతం ఈ మెలోడీ సాంగ్ యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

Kushi-Movie.jpg

ఇప్పటికే విడుదలైన ‘ఖుషి’ ఫస్ట్ సింగిల్ ‘నా రోజా నువ్వే’ (Naa Roja Nuvve) వంద మిలియన్ల వ్యూస్‌ను క్రాస్ చేసింది. ఇన్‌‌స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌లో ఇలా ఎక్కడపడితే అక్కడ ట్రెండ్ అవుతూనే ఉంది. రెండో పాట ‘ఆరాధ్య’ (Aradhya) సైతం శ్రోతలను కట్టి పడేసింది. ఇప్పుడీ మూడో పాట ‘ఖుషి’ సైతం చార్ట్‌బస్టర్ అయ్యేలా కనిపిస్తోంది. భారీ తారాగణం నటిస్తోన్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 1న తెలుగుతో పాటు తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు.


ఇవి కూడా చదవండి:

**************************************

*Ajith Kumar: తమన్నా కోసం ట్రై చేయండి

*************************************

* Sai Dharam Tej: అభిమానులకు విన్నపం.. నాకిప్పుడు అంత ధైర్యం లేదు

*************************************

*Ileana: రెండు నెలలలోనే ఇంత మార్పా.. ఇలియానా ఇప్పుడెలా ఉందో చూశారా?

**************************************

*Anuj Gurwara: పాటలు పాడుకోకుండా.. ఎందుకయ్యా నీకీ భజన?

**************************************

*Rajasekhar: ‘గబ్బర్‌సింగ్‌’లో పవన్.. ‘భోళా శంకర్’లో చిరు.. మాములుగా వాడలేదుగా..

**************************************

Updated Date - 2023-07-28T19:59:54+05:30 IST