Narayana and Co Teaser: డైటింగ్‌ మనుషులకేనా? దేవుళ్లకి అక్కర్లేదా? హిలేరియస్!

ABN , First Publish Date - 2023-03-29T19:54:06+05:30 IST

నారాయణ ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తి. అతనికో తిక్కల్ ఫ్యామిలీ ఉంటుంది. అతని భార్య ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతుంది. అతని పెద్ద కొడుకు బెట్టింగ్‌పై..

Narayana and Co Teaser: డైటింగ్‌ మనుషులకేనా? దేవుళ్లకి అక్కర్లేదా? హిలేరియస్!
Narayana & Co Movie Still

యంగ్ హీరో సుధాకర్ కోమాకుల (Sudhakar Komakula) హీరోగా తెరకెక్కుతోన్న హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘నారాయణ అండ్ కో’ (Narayana and Co). చిన్న పాపిశెట్టి (Chinna Papisetty) దర్శకత్వంలో పాపిశెట్టి ఫిల్మ్ ప్రొడక్షన్స్, సుఖ మీడియా బ్యానర్‌లపై పాపిశెట్టి బ్రదర్స్‌తో కలిసి సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన మేకర్స్ తాజాగా చిత్ర టీజర్‌ని విడుదల చేశారు. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల (Sekhar Kammula) ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. టీజర్ విడుదల అనంతరం శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్ (Life is Beautiful) సినిమాలో నటించిన వారంతా పెద్ద పొజిషన్‌లో వున్నారు. సుధాకర్ కూడా ప్రయత్నిస్తున్నాడు. తనకు ప్రతిభ, డ్యాన్స్, లుక్స్, యాక్టింగ్ అన్నీ వున్నాయి. చాలా కష్టపడతాడు. ఈ సినిమాతో తను కోరుకునే స్థాయికి వెళ్తాడని భావిస్తున్నాను. టీజర్ చాలా ఫన్‌గా వుంది. ఇలాంటి జానర్ సినిమాలని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఓ రెండు గంటలు మనల్ని మనం మర్చిపోయి చూసే సినిమాలివి. అలాంటి ఫ్లావర్, ఎనర్జీ కనిపిస్తుంది. దర్శకుడు చిన్నా చాలా చక్కగా తీశారు. యంగ్ టీం పని చేస్తోంది. ఆమనిగారు లాంటి సీనియర్ కూడా వున్నారు. సినిమా చాలా కొత్తగా కనిపిస్తోంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరారు. (Narayana and Co Teaser)

Sekhar-Kammula.jpg

టీజర్ విషయానికి వస్తే.. (Narayana and Co Teaser Talk) నారాయణ ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తి. అతనికో తిక్కల్ ఫ్యామిలీ ఉంటుంది. అతని భార్య ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతుంది. అతని పెద్ద కొడుకు బెట్టింగ్‌పై ఆసక్తి చూపుతుండగా, అతని చిన్న కొడుకు ఫోటోగ్రాఫర్ కావాలనుకుంటున్నాడు. ఒక యువకుడు, ఒక స్థానిక డాన్.. రాజకీయ నాయకుడు కావాలని అనుకుంటారు. కొందరు బకరాల కోసం వెదుకుతుండగా నారాయణ కుటుంబాన్ని ట్రాప్ చేస్తారు, ఇది కామెడీ ఆఫ్ ఎర్రర్‌ని జనరేట్ చేస్తుంది. చిన్న పాపిశెట్టి కామెడీని చాలా సమర్ధవంతంగా హ్యాండిల్ చేశారు. ఫ్రెష్ ఫీలింగ్‌తో టీజర్ ఆహ్లాదకరంగా ఉంది. సుధాకర్ కామిక్ టైమింగ్, చివరి సీక్వెన్స్ హిలేరియస్‌గా ఉన్నాయి. దేవి ప్రసాద్, ఆమని, పూజా కిరణ్, జై కృష్ణ.. ఇలా ప్రతి ఒక్కరితో దర్శకుడు కామెడీ చేయించాడు. ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.

Sudhakar-Komakula.jpg

టీజర్ విడుదల సందర్భంగా హీరో సుధాకర్ కోమాకుల మాట్లాడుతూ.. టీజర్ విడుదల చేసిన శేఖర్ కమ్ములగారికి కృతజ్ఞతలు. చాలా బిజీలో ఉన్నప్పటికీ మా కోసం వచ్చారు. ఇది జీవితంలో మర్చిపోలేని విషయం. ‘నారాయణ & కో’లో ఒక నిర్మాతగా కూడా వున్నాను. దీనికి కారణం ఎప్పటి నుంచో మంచి కంటెంట్ క్రియేట్ చేయాలనే ఆలోచన వుండేది. దర్శకుడు చిన్న చాలా మంచి కథతో వచ్చారు. ‘నారాయణ & కో’.. కోట్లాది మందికి రీచ్ అవుతుంది. ఫ్యామిలీ అంతా కలిసి చూడాల్సిన సినిమా. క్రైమ్ కామెడీ. మిడిల్ క్లాస్, క్రైమ్ కామెడీ క్రేజీ కాంబినేషన్. అందుకే తిక్కల్ ఫ్యామిలీ అన్నాను. దేవి ప్రసాద్ (Devi Prasad), ఆమని (Aamani) గారితో పాటు మిగతా వారంతా కూడా అద్భుతంగా నటించారని తెలిపారు. (Narayana and Co Teaser Out)


ఇవి కూడా చదవండి:

*********************************

*Rocking Rakesh: జోర్దార్ సుజాత టార్చర్ పెట్టిందా? ఏడుస్తూ.. అసలు విషయం చెప్పేసిన రాకేష్!

*Tollywood: శోభితతో చైతూ.. సుప్రియతో శేష్.. ఇలా దొరికేశారేంటి?

*Sana: అందుకే అలీ రెజాతో రొమాంటిక్ సీన్ చేశా.. అలాంటివి ఇంకా చేయాలని ఉంది

*Upasana: ఉపాసన బేబీ బంప్ ఫొటో వైరల్.. ఇక డౌట్స్ వద్దమ్మా..!

*SSMB28: మళ్లీ అప్పటి వరకు అప్‌డేట్స్ అడగవద్దు.. ఫ్యాన్స్‌కి నిర్మాత హెచ్చరిక

*Bhanushree Mehra: మరో బాంబ్ పేల్చిన అల్లు అర్జున్ ‘వరుడు’ హీరోయిన్

*Singer Dhee: దసరా మూవీలోని ‘ఛమ్కీల అంగీలేసి’ పాట సింగర్ గురించి ఈ విషయం తెలుసా?

Updated Date - 2023-03-29T19:54:07+05:30 IST