Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ విడుదల తేదీ ఫిక్సయింది

ABN , First Publish Date - 2023-06-05T16:39:18+05:30 IST

స్టార్‌బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఇంతకు ముందు ప్రేక్షకుల నుంచి బీభత్సమైన స్పందనను రాబట్టుకున్న ‘డీజే టిల్లు’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 15న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా తెలిపారు.

Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ విడుదల తేదీ ఫిక్సయింది
Tillu Square Release Date Out

స్టార్‌బాయ్ సిద్ధు జొన్నలగడ్డ (Starboy Siddhu) హీరోగా ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square) అనే చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ (Sithara Entertainments), ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ (Fortune Four Cinemas) కలిసి శ్రీకర స్టూడియోస్ (Srikara Studios) సమర్పణలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. (Tillu Square Release Date)

‘డీజే టిల్లు’ చిత్రంతో ఘన విజయాన్ని అందుకున్న సిద్ధు, అదే పేరుతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, టాలెంటెడ్ హీరో అయిన సిద్ధు నుంచి వచ్చిన ఈ కొత్తతరం కామెడీ థ్రిల్లర్‌ ప్రేక్షకులను భారీగా ఆకట్టుకుంది. ముఖ్యంగా డీజే టిల్లు (DJ Tillu) పాత్రను ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడ్డారు. ‘డీజే టిల్లు’ సాధించిన ఘన విజయంతో.. వెంటనే మేకర్స్ ఈ చిత్రానికి సీక్వెల్ ‘టిల్లు స్క్వేర్’‌ను అనౌన్స్ చేశారు. మధ్యలో ఈ సీక్వెల్‌కు సంబంధించి అనేకానేక వార్తలు వైరల్ అయినప్పటికీ.. టాప్ నిర్మాణ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటంతో వాటన్నింటిని జయించి.. ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. ‘డీజే టిల్లు’లో సిద్ధు సరసన నేహా శెట్టి (Neha Shetty) నటించగా.. ఈ సీక్వెల్‌లో ఆ ప్లేస్‌ని అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) సొంతం చేసుకుంది.

Tillu-Square.jpg

‘డీజే టిల్లు’ సీక్వెల్ ‘టిల్లు స్క్వేర్’‌ను 15 సెప్టెంబర్, 2023న విడుదల చేయబోతున్నట్లుగా చిత్రబృందం సోమవారం అధికారికంగా ప్రకటిస్తూ ఓ రొమాంటిక్ పోస్టర్‌ (Tillu Square Romantic Poster)ని విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో సిద్ధు-అనుపమ పరమేశ్వరన్‌‌ కారులో రొమాంటిక్ సన్నివేశంలో జీవించేస్తున్నారు. ఈ చిత్రం మొదటి భాగాన్ని మించి రెట్టింపు వినోదాన్ని, థ్రిల్‌ని అందిస్తుందని చిత్ర బృందం నమ్మకంగా చెబుతోంది. మల్లిక్ రామ్ (Mallik Ram) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ ‘టిల్లు స్క్వేర్‌’కు రామ్ మిరియాల, శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

************************************************

*Eega 2: రాజమౌళి ‘ఈగ’ మళ్లీ ఎగురుతుందా?

*Udhayanidhi Stalin: తల్లి, భార్య సమక్షంలో.. ఉదయనిధి సంచలన నిర్ణయం

*Megastar Chiranjeevi: అలా క్యాన్సర్ బారిన పడకుండా తప్పించుకున్నా.. ఫస్ట్ టైమ్ రివీల్ చేసిన మెగాస్టార్!

*Anasuya: ఇప్పటిదాకా మోకాళ్ల పైన పట్టుకున్న మగాళ్లనే చూశా..!

Updated Date - 2023-06-05T16:39:18+05:30 IST