Eega 2: రాజమౌళి ‘ఈగ’ మళ్లీ ఎగురుతుందా?

ABN , First Publish Date - 2023-06-05T15:56:31+05:30 IST

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, న్యాచురల్ స్టార్ నాని కాంబినేషన్‌లో రూపొందిన ఎక్స్‌పెర్‌మెంటల్‌ సినిమా ‘ఈగ’. ఇటీవల వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో రాజమౌళి పాన్ వరల్డ్ దర్శకుడిగా మారిపోగా.. ఇక ఈగ సినిమాకు సంబంధించి సీక్వెల్ ఉండదని అంతా అనుకున్నారు. కానీ రాజమౌళి ఈగ సీక్వెల్‌‌కి కథ ఎలా ఉండాలో ఒక ప్లాన్‌కి వచ్చినట్లుగా తెలుస్తోంది.

Eega 2: రాజమౌళి ‘ఈగ’ మళ్లీ ఎగురుతుందా?
SS Rajamouli Plans Eega 2

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) కెరీర్‌లో ‘ఈగ’కు ప్రత్యేకమైన స్థానం ఉంది. చిన్న సినిమాగా విడుదలై.. పెద్ద విజయాన్ని అందుకొన్న ఈ చిత్రం రాజమౌళి సృజనాత్మకతకు అద్దం పటింది. సీజీలతో అద్భుతాలు చేయొచ్చన్న నమ్మకాన్ని రాజమౌళికి కల్పించింది. ఈ సినిమాకి సీక్వెల్‌ వస్తుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. నాని (Natural Star Nani) కూడా ‘పార్ట్‌ 2 ఎప్పుడూ..?’ అంటూ వీలైనప్పుడల్లా జక్కన్న (Jakkanna)ని అడుగుతూనే ఉన్నాడు. అయితే రాజమౌళి ఇప్పుడు పాన్‌ వరల్డ్‌ (Pan World) డైరెక్టర్‌ అయిపోయారు. అన్నీ పెద్ద ప్రాజెక్టులే. ఈ నేపథ్యంలో ‘ఈగ 2’ వచ్చే ఛాన్సులు లేవనుకొన్నారంతా. ‘ఈగ’ టీమ్‌ కూడా ఈ విషయాన్ని లైట్‌ తీసుకొంది. అయితే అనూహ్యంగా రాజమౌళి దృష్టి ‘ఈగ’ సీక్వెల్‌పై పడినట్టు టాక్‌.

‘ఈగ 2’లో ఏం చూపించాలి? ఆ కథ ఎలా ఉండాలి? అనే విషయమై రాజమౌళికి ఓ స్పష్టత వచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం ఓ టీమ్‌తో ఈ స్క్రిప్టుని రెడీ చేసే పనిలో ఉన్నారని ఇన్‌ సైడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ (RRR) తర్వాత మహేశ్‌బాబు (Mahesh Babu)తో ఓ సినిమా పట్టాలెక్కిస్తున్నాడు రాజమౌళి. అది పూర్తయిన తర్వాత.. ‘ఈగ 2’ (Eega 2)ని సెట్స్‌పైకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ‘ఈగ’ని ఎలాగైతే ప్రయోగాత్మక చిత్రంగా భావించి మొదలెట్టారో, అలానే ‘ఈగ 2’ని సైతం ఓ ఎక్స్‌పెర్‌మెంటల్‌ సినిమాగా తీర్చిదిద్దబోతున్నారట. మరి ఈ ‘ఈగ’ ఎలా ఉంటుందో తెలియాలంటే రాజమౌళి నోరు విప్పాల్సిందే.

SSR.jpg

మరో వైపు మహేష్ బాబుతో రాజమౌళి చేయాలనుకుంటున్న ప్రాజెక్ట్‌ (SSMB29)కు సంబంధించి అనేక రకాలుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా ఉండబోతుందని, మూడు భాగాలుగా రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారనేలా టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివరిలో లేదంటే.. వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ను రాజమౌళి అండ్ టీమ్ స్టార్ట్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone) హీరోయిన్‌గా నటించే అవకాశాలున్నట్లుగా కూడా టాక్ నడుస్తోంది.

ఇవి కూడా చదవండి:

************************************************

*Udhayanidhi Stalin: తల్లి, భార్య సమక్షంలో.. ఉదయనిధి సంచలన నిర్ణయం

*Megastar Chiranjeevi: అలా క్యాన్సర్ బారిన పడకుండా తప్పించుకున్నా.. ఫస్ట్ టైమ్ రివీల్ చేసిన మెగాస్టార్!

*Adipurush: ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఏం చేస్తున్నాడో తెలుసా?

*Anasuya: ఇప్పటిదాకా మోకాళ్ల పైన పట్టుకున్న మగాళ్లనే చూశా..!

Updated Date - 2023-06-05T15:56:31+05:30 IST