కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hari Hara Veera Mallu: పవర్‌ఫుల్ పోస్టర్‌తో ఫ్యాన్స్‌కి ట్రీట్..

ABN, First Publish Date - 2023-09-02T18:25:31+05:30

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న, క్రిష్ జాగర్లమూడి రచించి, దర్శకత్వం వహిస్తున్న భారీ హిస్టారికల్ డ్రామా ‘హరి హర వీర మల్లు’ నుంచి ప్రేక్షకులకు అద్భుతమైన ట్రీట్ ఇచ్చారు మేకర్స్. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం నుండి అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో కూడిన ఒక కొత్త పోస్టర్‌ని మేకర్స్ వదిలారు.

Pawan Kalyan in HHVM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న, క్రిష్ (Krish) జాగర్లమూడి రచించి, దర్శకత్వం వహిస్తున్న భారీ హిస్టారికల్ డ్రామా ‘హరి హర వీర మల్లు’ (Hari Hara Veera Mallu) నుంచి ప్రేక్షకులకు అద్భుతమైన ట్రీట్ ఇచ్చారు మేకర్స్. ఏ దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్ పై ఏఎమ్ రత్నం సమర్పిస్తున్నారు. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం నుండి అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో కూడిన ఒక కొత్త పోస్టర్‌ని మేకర్స్ వదిలారు.


ఈ పవర్‌ఫుల్ పోస్టర్‌లో గడ్డంతో ఉన్న పవన్ కళ్యాణ్ ఎరుపు సాంప్రదాయ దుస్తులు, నలుపు పైజామా ధరించి ఉన్నారు. ఆయన చేతిలో దెబ్బలు తిన్న శత్రువులు నేల మీద పడి ఉండటం, మట్టి దుమ్ము లేవడం మనం గమనించవచ్చు. ఈ చిత్రానికి ‘ది లెజెండరీ హీరోయిక్ అవుట్‌లా’ అని ఉప శీర్షికను జోడించి, ‘హ్యాపీ బర్త్‌డే పవన్ కళ్యాణ్ గారూ’ అని చిత్ర బృందం శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ పోస్టర్‌ వీడియో నేపథ్య సంగీతం పోస్టర్‌ను మరింత శక్తివంతంగా మార్చింది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ పాన్-ఇండియన్ చిత్రం 17వ శతాబ్దానికి చెందిన చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడిన ఒక వ్యక్తి కథను చెప్పబోతోంది. (Powerful Poster From Hari Hara Veera Mallu Out)

ఈ బహుభాషా చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. మొఘలులు మరియు కుతుబ్ షాహీ రాజుల కాలం నాటి కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించనుందని మేకర్స్ చెబుతున్నారు. ఆ కాలపు చారిత్రక అంశాలకు సంబంధించిన వివరాలు మరియు పరిశోధనలకు గొప్ప ప్రాధాన్యత ఇవ్వబడింది. జాతీయ అవార్డు, అకాడమీ అవార్డు గ్రహీత స్వరకర్త ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తొలిసారి చారిత్రక చిత్రంలో కనిపించనుండటం ఈ సినిమాకున్న ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.


ఇవి కూడా చదవండి:

============================

*Thrigun: పెళ్లిపీటలు ఎక్కుతోన్న మరో టాలీవుడ్ యంగ్ హీరో..

*************************************

*Pawan Kalyan: ఈ రోజుల్లో ఎవడున్నాడ్రా.. ఇలాంటోడు!

*************************************

*Bhagavanth Kesari: హైలీ ఎనర్జిటిక్ గణేష్ సాంగ్‌లో బాలయ్య, శ్రీలీల.. అరుపులే!!

**************************************

*Miss Shetty Mr Polishetty: సెన్సార్ పూర్తి.. ఇక తెరపై చూసుకుందాం

*************************************

*Salaar: ‘సలార్’ వాయిదా పడనుందా? తీవ్ర నిరాశలో ప్రభాస్ ఫ్యాన్స్

*************************************

Updated Date - 2023-09-02T18:25:31+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!