Spy: భారీ ధరకు అమ్ముడైన నిఖిల్ ‘స్పై’ మూవీ నాన్ థియేట్రికల్ రైట్స్

ABN , First Publish Date - 2023-04-06T21:55:41+05:30 IST

‘కార్తికేయ 2’ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన హీరో నిఖిల్. ఇప్పుడు మరోసారి తన సత్తా చాటేందుకు ‘స్పై’ అనే చిత్రంతో సిద్ధమవుతున్నాడు. ఈ చిత్ర నాన్ థియేట్రికల్ రైట్స్ ఎంతకు అమ్ముడయ్యాయంటే..

Spy: భారీ ధరకు అమ్ముడైన నిఖిల్ ‘స్పై’ మూవీ నాన్ థియేట్రికల్ రైట్స్
Nikhil in Spy Movie

యంగ్ హీరో నిఖిల్ (Nikhil) నటించిన ‘కార్తికేయ 2’ (Karthikeya 2) నేషనల్ వైడ్ బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం విడుదలైన అన్ని చోట్ల ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడా సినిమా తరహాలోనే నిఖిల్.. మరోసారి పాన్ ఇండియా (Pan India) వైడ్‌గా తన సత్తా చాటేందుకు ‘స్పై’ (Spy) అనే మూవీతో వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కార్తికేయ 2 లానే ‘స్పై’ కూడా యూనివర్సల్ అప్పీల్, యూనిక్ పాయింట్‌తో బహుభాషా చిత్రంగా రూపొందుతోంది. పాపులర్ ఎడిటర్ గ్యారీ బిహెచ్ (Garry BH) దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని చరణ్‌తేజ్ ఉప్పలపాటి (Charantej Uppalapati) సిఇఓగా ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై కె రాజశేఖర్ రెడ్డి (K Rajashekhar Reddy) భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పుడీ సినిమాకు సంబంధించిన నాన్ థియేట్రికల్ రైట్స్ (Non-Theatrical Rights) భారీ ధరకు అమ్ముడైనట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Read Also- Game Changer: ‘గేమ్ ఛేంజర్’ విడుదల ఇప్పుడప్పుడే లేనట్టే.. దిల్ రాజు ఏమన్నారంటే?

ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ఇతర ప్రమోషనల్ కంటెంట్‌కి మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా.. సినిమాపై బజ్‌ని క్రియేట్ చేశాయి. అందుకే ఈ సినిమా నాన్-థియేట్రికల్ రైట్స్‌ ఫ్యాన్సీ ధరకు అమ్ముడయ్యాయి. అమెజాన్, స్టార్ నెట్‌వర్క్ (Amazon and Star Network) కలిసి ఈ చిత్రం పూర్తి నాన్-థియేట్రికల్ హక్కులను రూ. 40 కోట్లకు సొంతం చేసుకున్నాయి. ఇది ఇప్పటివరకు నిఖిల్‌ కెరీర్‌లోనే హయ్యెస్ట్. ఈ సినిమా రష్‌ని చూసి, అవుట్‌పుట్ నచ్చడంతో నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం పోటీ పడి మరీ భారీ ధర వెచ్చించినట్లుగా మేకర్స్ తెలిపారు. (Nikhil Spy Movie Non-Theatrical Rights)

నిఖిల్ సరసన ఐశ్వర్యా మీనన్ (Iswarya Menon) కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆర్యన్ రాజేష్ (Aryan Rajesh) ఓ కీలక పాత్ర చేస్తున్నారు. పూర్తి యాక్షన్-ప్యాక్‌డ్ స్పై థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి నిర్మాత కె రాజశేఖర్ రెడ్డి కథను అందించారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఏక కాలంలో ఈ సినిమా విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి:

*********************************

*Rashmika Mandanna: త్వరలోనే గుడ్ న్యూస్.. రౌడీ హీరోతో ఒకే ఇంట్లో, ఒకే గదిలో..!?

*NBK SRH: పాపం మన SRH క్రికెటర్లు.. బాలయ్య డైలాగ్స్ చెప్పలేక ఎన్ని తిప్పలు పడ్డారో..!

*Dasara Nani: అందరికీ చెప్పేది ఒకటే.. చాలా మంది చాలా చెప్తారు.. ఎవ్వరి మాటలు వినకండి

*Ustaad Bhagat Singh: ఫ్రంట్ ఏంటి? బ్యాక్ ఏంటి?.. కంటెంట్ ఉన్నోడి కటౌట్ చాలదా..

*Hanuman Jayanti Special: ‘ఆదిపురుష్’ నుంచి హనుమాన్ పోస్టర్.. ఎలా ఉందంటే?

*Upasana Baby Shower Party: వీడియోతో సర్‌ప్రైజ్ చేసిన ఉపాసన.. చరణ్ లుక్ అదుర్స్!

Updated Date - 2023-04-06T21:55:43+05:30 IST