Game Changer: ‘గేమ్ ఛేంజర్’ విడుదల ఇప్పుడప్పుడే లేనట్టే.. దిల్ రాజు ఏమన్నారంటే?

ABN , First Publish Date - 2023-04-06T18:41:17+05:30 IST

రీసెంట్‌గా ‘గేమ్ ఛేంజ‌ర్‌’ చిత్ర టైటిల్ రివీల్ వీడియో, ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. అయితే చిత్ర విడుదలకు సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం రాలేదు. దీనిపై దిల్ రాజు మాట్లాడుతూ..

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ విడుదల ఇప్పుడప్పుడే లేనట్టే.. దిల్ రాజు ఏమన్నారంటే?
Dil Raju about Game Changer Release

గ్లోబ‌ల్‌ స్టార్ రామ్ చ‌ర‌ణ్ (Global Star Ram Charan) హీరోగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ (Director Shankar) ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా చిత్రానికి ‘గేమ్ ఛేంజ‌ర్‌’ (Game Changer) అనే టైటిల్‌ను ఖ‌రారు చేసిన విషయం తెలిసిందే. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ క్రియేష‌న్స్ (SVC) బ్యాన‌ర్‌పై భారీ బ‌డ్జెట్‌తో నిర్మాత‌లు దిల్ రాజు (Dil Raju), శిరీష్ (Shirish) అన్ కాంప్ర‌మైజ్డ్‌గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) పుట్టిన‌రోజు (మార్చి 27) సందర్భంగా ఈ చిత్ర టైటిల్ రివీల్ వీడియో, ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. అయితే చిత్ర విడుదలకు సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం రాలేదు. రామ్ చరణ్ పుట్టినరోజున విడుదల తేదీని కూడా ప్రకటిస్తారని అంతా అనుకున్నారు.. కానీ అది జరగలేదు. దీంతో ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా? అని వేచి చూస్తున్న వారందరికీ తాజాగా నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు.

తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘ ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా తర్వాత రామ్ చరణ్ పాన్ ఇండియా (Pan India) స్టార్ అయ్యాడు. శంకర్‌గారు ఆల్రెడీ తెలుగు స్టేట్స్‌లో, తమిళనాడులో, హిందీలో పాపులర్. దిల్ రాజు అనగానే తెలుగు స్టేట్స్ టాప్‌లో ఉంటాడు. తమిళ్‌లో వారిసు తరువాత, అటు హిందీలో కూడా మంచి పొజిషన్‌లో మా సంస్థ ఉంది. అందరం కలిసి ఉన్నాం కాబట్టి డెఫినెట్‌గా ఇది పాన్ ఇండియా సినిమా. శంకర్ గారు చాలా కాలం టైమ్ ఎక్కువ తీసుకుని విఎఫ్‌ఎక్స్ సినిమాలు చేశారు. ఇప్పుడు పాత రోజుల్లాగా కంటెంట్ బేస్డ్, అందరికీ రీచ్ అయ్యే విధంగా, ఒక సోషల్ ప్రాబ్లెమ్ మీద ఒక కమర్షియల్ ఫిలిం తీస్తున్నారు. సాంగ్స్, ఫైట్స్, అందరికీ రీచ్ అయ్యే కంటెంట్.. ఇంతకంటే ఓ పాన్ ఇండియా సినిమాకి ఇంకేం కావాలి. (Dil Raju About Game Changer)

‘గేమ్ ఛేంజర్’కి సంబంధించి కంటెంట్ అంతా శంకర్ గారు చూసుకుంటారు. నేను ప్రమోషన్స్ చూసుకుంటున్నాను. ఇప్పటి వరకు సాంగ్స్, యాక్షన్ పార్ట్ ఫినిష్ అయ్యింది. 70 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఇంకా 30 శాతం చిత్రీకరణ జరగాల్సి ఉంది. ఆగస్ట్ లేదంటే సెప్టెంబర్‌కి చిత్రీకరణ మొత్తం పూర్తవుతుందని అనుకుంటున్నాం. ఆ తర్వాత శంకర్‌గారు చెప్పిన దాని బట్టి రిలీజ్ డేట్ ఉంటుంది. అప్పటి వరకు రిలీజ్ డేట్ విషయంలో ఎవరెన్ని మాటలైనా చెప్పవచ్చు. కానీ ఫైనల్‌గా శంకర్ గారే డిసైడ్ చేయాలి (Game Changer Release Details)..’’ అని దిల్ రాజు చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

*********************************

*Rashmika Mandanna: త్వరలోనే గుడ్ న్యూస్.. రౌడీ హీరోతో ఒకే ఇంట్లో, ఒకే గదిలో..!?

*NBK SRH: పాపం మన SRH క్రికెటర్లు.. బాలయ్య డైలాగ్స్ చెప్పలేక ఎన్ని తిప్పలు పడ్డారో..!

*Dasara Nani: అందరికీ చెప్పేది ఒకటే.. చాలా మంది చాలా చెప్తారు.. ఎవ్వరి మాటలు వినకండి

*Ustaad Bhagat Singh: ఫ్రంట్ ఏంటి? బ్యాక్ ఏంటి?.. కంటెంట్ ఉన్నోడి కటౌట్ చాలదా..

*Hanuman Jayanti Special: ‘ఆదిపురుష్’ నుంచి హనుమాన్ పోస్టర్.. ఎలా ఉందంటే?

*Upasana Baby Shower Party: వీడియోతో సర్‌ప్రైజ్ చేసిన ఉపాసన.. చరణ్ లుక్ అదుర్స్!

Updated Date - 2023-04-06T18:41:19+05:30 IST