Nayanthara: ఇద్దరు హీరోలతో నయన్ రొమాన్స్!

ABN , First Publish Date - 2023-04-08T15:18:08+05:30 IST

అందం, అభినయంతో రెండు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న అందాల భామ నయనతార (Nayanthara). భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లో సినిమాలు చేసింది. నయన్ కొత్త సినిమాను అతి త్వరలోనే ప్రకటించనుంది.

Nayanthara: ఇద్దరు హీరోలతో నయన్ రొమాన్స్!

అందం, అభినయంతో రెండు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న అందాల భామ నయనతార (Nayanthara). భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లో సినిమాలు చేసింది. నయన్ కొత్త సినిమాను అతి త్వరలోనే ప్రకటించనుంది. ఈ చిత్రంలో ఇద్దరు హీరోలతో కలసి నయన్ రొమాన్స్ చేయనుందని రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి.

నయనతార, మాధవన్ (Madhavan), సిద్దార్థ్‌ (Siddharth)తో కలసి సినిమా చేయనుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని డెబ్యుటెంట్ తెరకెక్కించనున్నారు. వై నాట్ స్టూడియోస్‌కు చెందిన శశికాంత్ (Sashikanth) దర్శకత్వం వహించనున్నారు. చాన్నాళ్లుగా నిర్మాతగా వ్యవహరిస్తున్న శశి కెప్టెన్ కుర్చీలో కూర్చొనున్నారు. ఈ మూవీకి ‘ది టెస్ట్’ (The Test) అని టైటిల్ పెట్టారని వదంతులు షికార్లు కొడుతున్నాయి. ఏప్రిల్ చివరి నాటికి సినిమా పట్టాలెక్కనుందని కోలీవుడ్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. సిద్దార్థ్, మాధవన్ కలసి గతంలో రెండు సినిమాలు చేశారు. ‘రంగ్ దే బసంతి’ (Rang De Basanti), ‘యువ’ (Yuva) చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. శశికాంత్ గతంలో అనేక సినిమాలను నిర్మించారు. ‘విక్రమ్ వేద’, ‘మండేలా’, ‘సూపర్ డీలక్స్’ వంటి చిత్రాలను ప్రొడ్యూస్ రాశారు.

The Test.jpg

నయనతార, సిద్దార్థ్, మాధవన్ ప్రస్తుతం అనేక సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. లేడీ సూపర్ స్టార్ అతి త్వరలోనే 75వ మూవీ షూటింగ్‌ను ప్రారంభించనుంది. ‘జీడీ. నాయుడు’ (GD. Naidu) అనే చిత్రాన్ని మాధవన్ ఈ మధ్యనే ప్రకటించారు. ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషించనున్నారు. సిద్దార్థ్ ‘కీడా కోలా’ (Keeda Kola) అనే పాన్ ఇండియా ప్రాజెక్టులో కీలక పాత్ర పోషిస్తున్నారు.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

Jr NTR: భారీగా రెమ్యునరేషన్ అందుకుంటున్న తారక్!

Salman Khan: యంగ్ హీరోలపై షాకింగ్ కామెంట్స్

Chor Nikal Ke Bhaga: ‘ఆర్ఆర్ఆర్’ రికార్డును చెరిపేసిన బాలీవుడ్ సినిమా

Koffee With Karan: భార్యతో కలిసి రావాలంటూ సౌత్ స్టార్ హీరోలకు పిలుపు.. బుక్ చేస్తాడేమో చూసుకోండి..

Updated Date - 2023-04-08T19:40:50+05:30 IST