Desamuduru: చొక్కాలు విప్పి మరీ అభిమానం చాటుకుంటున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్

ABN , First Publish Date - 2023-04-06T11:15:21+05:30 IST

అల్లు అర్జున్ నటించిన 'దేశముదురు' మళ్ళీ విడుదల అయింది. థియేటర్స్ లో ఒకటే గోల, అభిమానులు ఏమి చేసారో చూస్తే మీరు షాక్ అవుతారు....

Desamuduru: చొక్కాలు విప్పి మరీ అభిమానం చాటుకుంటున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్

ఇప్పుడు పాత సినిమాలు మళ్ళీ విడుదల ట్రెండ్ కదా. అలాగే అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన హిట్ సినిమా 'దేశముదురు' (#Desamuduru4KSpecialShows) మళ్ళీ విడుదల అయింది. విడుదల అయినా చోటల్లా అభిమానులు పోటెత్తుతున్నారు. థియేటర్ లో ఒకటే గోల గోల. అల్లు అర్జున్ 'దేశముదురు' ఒక పెద్ద విజయం సాధించిన సినిమా. #Desamuduru4KSpecialShows పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దీనికి దర్శకుడు, 'ఆర్.ఆర్.ఆర్' (RRR) నిర్మించిన దానయ్య (DVV Danayya) ఈ సినిమాకి నిర్మాత. ఈ సినిమా ఇప్పుడు మళ్ళీ విడుదల అయింది, విజయడంకా మోగిస్తోంది.

alluarjundesamuduru.jpg

కొన్ని థియేటర్స్ లో అయితే అభిమానులు చొక్కాలు విప్పి మరీ డాన్స్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అల్లు అర్జున్ ఈ సినిమా లో సిక్స్ ప్యాక్ బాడీ చూపించటమే కాకుండా, #DesamuduruCelebrations పాటలన్నీ డాన్స్ లతో ఇరగదీసాడు. అందుకని అభిమానులు కూడా ఈ సినిమాలో పాటలు రాగానే చొక్కాలు ఇప్పి మరీ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

alluarjundesamuduru2.jpg

కొన్ని థియేటర్స్ లో అయితే ఈ సినిమాలోని పాటలు రెండో సారి కూడా వేస్తున్నారు. అభిమానుల కోరిక మేరకు థియేటర్ యాజమాన్యం ఈ సినిమాలోని పాటలను రెండో సారి వేస్తున్నారు, అభిమానులు ఆ పాటలకు గెంతుతున్నారు కూడా. హాలిడే లేని రోజే ఇలా వుంది అంటే, ఇంకా హాలిడే అయితే పరిస్థితి ఏంటి అని అభిమానులు అనుకుంటున్నారు.

Updated Date - 2023-04-06T11:15:22+05:30 IST