Jr NTR: అఫీషియల్.. మరో యుద్ధానికి సిద్ధం

ABN , First Publish Date - 2023-04-05T11:13:59+05:30 IST

NTR30కి సంబంధించి వరుస అప్‌డేట్స్‌తో అల్లాడించిన ఎన్టీఆర్ (NTR).. ఇప్పుడు మరో యుద్ధమే ప్రకటించేశాడు. తన డైరెక్ట్ బాలీవుడ్ ఎంట్రీ చిత్రాన్ని..

Jr NTR: అఫీషియల్.. మరో యుద్ధానికి సిద్ధం
Young Tiger NTR

‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR) సినిమాకు సంబంధించి అప్‌డేట్స్ రాకపోవడంతో ఫ్యాన్స్ ఎంతగానో నిరాశకు లోనయ్యారు. అలా నిరాశకు లోనైన వారందరినీ ఇప్పుడు వరుస అప్‌డేట్స్‌తో ఎన్టీఆర్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. రీసెంట్‌గా ‘NTR30’ సినిమా ప్రారంభోత్సవం, ఆ వెంటనే రెగ్యులర్ షూటింగ్, అందులోని హీరోయిన్, అత్యుత్తమ సాంకేతిక నిపుణుల పరిచయం.. ఇలా వరుస అప్‌డేట్స్‌తో అల్లాడించిన ఎన్టీఆర్ (NTR).. ఇప్పుడు మరో యుద్ధమే ప్రకటించేశాడు. అర్థం కాలేదా? బాలీవుడ్‌ సూపర్ స్టార్ హృతిక్ రోషన్‌ (Hrithik Roshan)తో కలిసి యంగ్ టైగర్ ఎన్టీఆర్ యుద్ధం చేయబోతున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా కూడా ప్రకటించారు.

యష్ రాజ్ ఫిల్మ్ (Yash Raj Films) నిర్మాణంలో 2019లో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా తెరకెక్కిన ‘వార్’ (War) చిత్రానికి సీక్వెల్‌గా ఇప్పుడు ‘వార్ 2’ని ప్రకటించారు. యష్ రాజ్ ఫిల్మ్ స్పై యూనివర్స్‌గా (YRF Spy Universe) తెరకెక్కనున్న ఈ సీక్వెల్‌లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ చేయబోతున్నట్లుగా నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అయితే ‘వార్’ చిత్రాన్ని సిద్ధార్త్ ఆనంద్ (Siddharth Anand) డైరెక్ట్ చేస్తే.. ఈ ‘వార్ 2’ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ (Ayan Mukerji) డైరెక్ట్ చేయబోతున్నారు. అయాన్ ముఖర్జీ ఇటీవల ‘బ్రహ్మాస్త్ర’ చిత్రానికి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన ‘బ్రహ్మాస్త్ర 2 మరియు 3’ పార్ట్‌లకు సంబంధించిన అప్‌డేట్స్‌ను కూడా అధికారికంగా తెలియజేశారు. ఆ సినిమాల కంటే ముందే ‘వార్ 2’ చిత్రాన్ని ఆయన తెరకెక్కించబోతున్నారు. (War 2 Movie Announcement)

Also Read: Rashmika Mandanna: నేషనల్ క్రష్‌ ఎలా అయిందో తెలుసా?


NTR-31.jpg

యంగ్ టైగర్ ఎన్టీఆర్ డైరెక్ట్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న ఈ ‘వార్ 2’ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ ప్రకటనను బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ (Taran Adarsh) తన ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి ‘వార్ 2’ (War 2) చిత్రంలో నటించబోతున్నారు. హృతిక్ మరియు ఎన్టీఆర్ ఫస్ట్ టైమ్ కలిసి నటించబోతున్న ఈ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యష్ రాజ్ ఫిల్మ్ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్ యూనివర్స్‌గా తెరకెక్కించబోతుందని తరణ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇక ఈ అప్‌డేట్‌తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవంటే నమ్మాలి. కొరటాల శివ (Koratala Siva), ప్రశాంత్ నీల్ (Prashanth Neel).. ఇప్పుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ‘వార్ 2’.. ఇంకేం కావాలి. ఈ లైనింగ్ చూస్తే అర్థం అవడం లేదా.. టైగర్ ఒక అడుగు వెనక్కి తగ్గేది.. పంజాతో అటాక్ చేయడానికే అని. ప్రస్తుతం ‘వార్ 2’తో ఎన్టీఆర్‌లో గ్లోబల్‌గా ట్రెండ్ అవుతున్నారు. (Jr NTR in War 2)

Updated Date - 2023-04-05T11:14:00+05:30 IST