సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Shaakuntalam: ఇక అల్లు అర్జున్ ఫ్యాన్సే.. ఈ ప్రోమో అర్థం అదేనా?

ABN, First Publish Date - 2023-04-15T19:59:31+05:30

ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి వస్తున్న టాక్‌తో సమంత ఫ్యాన్స్ కూడా డిజప్పాయింట్ అవుతున్నారు. ఈ టాక్ విన్నవాళ్లంతా.. ఇప్పుడీ సినిమాని అల్లు అర్జున్ ఫ్యాన్సే

Shaakuntalam Movie
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్యాషనేట్ ఎపిక్ ఫిల్మ్ మేక‌ర్ గుణశేఖ‌ర్ (Gunasekhar) ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన పౌరాణిక ప్రేమకథా చిత్రం ‘శాకుంతలం’ (Shaakuntalam). ఈ ఎపిక్ లవ్ స్టోరీలో సమంత (Samantha), దేవ్ మోహన్ (Dev Mohan) జంటగా నటించారు. కాళిదాసు ర‌చించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా శాకుంత‌లంను రూపొందించారు దర్శకుడు గుణశేఖ‌ర్‌. శ్రీ వెంకటేశ్వ‌ర‌క క్రియేష‌న్స్ నిర్మాత దిల్ రాజు (Dil Raju) స‌మ‌ర్ప‌ణ‌లో గుణ టీమ్ వ‌ర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మించారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఏప్రిల్ 14న గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం.. మిక్స్‌డ్ టాక్‌తో థియేటర్లలో రన్ అవుతోంది. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి వస్తున్న టాక్‌తో సమంత ఫ్యాన్స్ కూడా డిజప్పాయింట్ అవుతున్నారు. ఈ టాక్ విన్నవాళ్లంతా.. ఇప్పుడీ సినిమాని అల్లు అర్జున్ ఫ్యాన్సే (Allu Arjun Fans) లేపాలి.. అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.

అందుకు కారణం ఈ చిత్రంలో అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హ (Allu Arha) ఓ కీలక పాత్రలో నటించింది. అల్లు అర్హను గుణశేఖర్ ఓ అద్భుతమైన పాత్రతో ఇండస్ట్రీకి పరిచయం చేశారు. చిన్నప్పటి భరత (Bharata) పాత్రలో అల్లు అర్హ అందరినీ ఆకర్షిస్తోంది. సినిమా చూసిన వాళ్లంతా అర్హ పాత్ర గురించే మాట్లాడుకుంటున్నారు. ముద్దు ముద్దు మాటలతో, చక్కని అభినయంతో అల్లు అర్హ చేసిన నటనకు అంతా ఫిదా అవుతున్నారు. అల్లు అర్హ తప్పిదే.. ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో కూడా ఎక్కడా టాక్ వినబడటం లేదు. మేకర్స్ కూడా ఇది గమనించినట్లు ఉన్నారు. తాజాగా అల్లు అర్హకు సంబంధించిన ప్రోమోని మేకర్స్ విడుదల చేశారు. (Allu Arha Role in Shaakuntalam)

ఈ ప్రోమోతో అల్లు ఫ్యాన్స్‌నే కాకుండా.. ఇతర ప్రేక్షకులను కూడా థియేటర్లకు రాబట్టాలనేది వారి ప్లాన్ కాబోలు. కాకపోతే.. సినిమా చూసిన వారంతా అల్లు అర్హ సీన్లను సోషల్ మీడియాలో వీడియో రూపంలో ఇప్పటికే పోస్ట్ చేశారు. అది కూడా ఈ సినిమా డ్యామేజ్‌కు కారణం అవుతుంది. ఆ డ్యామేజ్‌ని కంట్రోల్ చేయడానికో.. ‘శాకుంతలం’ అంటే అల్లు అర్హనే (Allu Arha Promo From Shaakuntalam Out) అన్నట్లుగా వినిపిస్తున్న టాక్ తెలుసుకునో.. మేకర్స్ అఫీషియల్‌గా అల్లు అర్హ సన్నివేశానికి సంబంధించిన వీడియో ప్రోమోని విడుదల చేశారు. ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతోంది.


ఇవి కూడా చదవండి:

*********************************

*Vetrimaaran: ‘విడుదల’కు పాజిటివ్ టాక్.. ఛాన్స్ ఇచ్చే టాలీవుడ్ హీరో ఎవరు?

*Tammreddy Bharadwaja: మీ ఫ్యామిలీస్‌‌ని తిట్టినప్పుడు.. ఏమైంది మీ మగతనం? ఇండస్ట్రీ హీరోలకి సూటి ప్రశ్న?

*Actress Prema: రెండో పెళ్లి విషయమై ఫుల్ క్లారిటీ ఇచ్చిన ప్రేమ..!

*Radhika Apte: నన్ను ఆ సర్జరీ చేయించుకోమన్నారు.. ఇప్పుడలా అంటేనా?

*Allu Arha: ‘రుద్రమదేవి’కి అల్లు అర్జున్.. ‘శాకుంతలం’కి అల్లు అర్హ

Updated Date - 2023-04-15T19:59:32+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!