Neha Shetty: సుట్టంలా వచ్చి.. ఇష్టసఖిగా మారుతోంది

ABN , First Publish Date - 2023-12-05T15:31:10+05:30 IST

అందంతో పాటు తన నటనతో ప్రేక్షకుల్ని మెప్పిస్తోంది యంగ్ టాలెంటెడ్ హీరోయిన్ నేహా శెట్టి. ‘డీజే టిల్లు’ సినిమాతో టాలీవుడ్‌లో సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో రాధికగా నేహా శెట్టి అభినయం ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. ‘డీజే టిల్లు’ తర్వాత సినిమాలు ‘బెదురులంక 2012’, ‘రూల్స్ రంజన్’ వరుస అవకాశాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో దూసుకెళుతోంది. నేడు (మంగళవారం) ఆమె పుట్టినరోజు.

Neha Shetty: సుట్టంలా వచ్చి.. ఇష్టసఖిగా మారుతోంది
Neha Shetty

అందంతో పాటు తన నటనతో ప్రేక్షకుల్ని మెప్పిస్తోంది యంగ్ టాలెంటెడ్ హీరోయిన్ నేహా శెట్టి (Neha Shetty). ‘డీజే టిల్లు’ (DJ Tillu) సినిమాతో టాలీవుడ్‌లో సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో రాధికగా నేహా శెట్టి అభినయం ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. ‘డీజే టిల్లు’ తర్వాత సినిమాలు ‘బెదురులంక 2012’, ‘రూల్స్ రంజన్’ వరుస అవకాశాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో దూసుకెళుతోంది. ‘రూల్స్ రంజన్’ (Rules Ranjann) సినిమాలో సమ్మోహనుడా (Sammohanuda) సాంగ్ ఛాట్ బస్టర్ అయ్యింది. ఈ పాట నేహా శెట్టి‌లోని డ్యాన్సింగ్ టాలెంట్‌ని చూపించింది. ఇప్పటికీ ఈ పాట హాట్ హాట్‌గా వైరల్ అవుతూనే ఉంది.

టాలీవుడ్‌లో ఇప్పుడు వరుస సినిమా అవకాశాలతో నేహా శెట్టి మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్‌గా మారింది. అందుకే గ్లామర్ ఫ్లస్ పర్‌ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న హీరోయిన్ కావాలనుకునే హీరోస్, డైరెక్టర్స్ నేహా శెట్టినే ప్రిఫర్ చేస్తున్నారు. హీరో విశ్వక్ సేన్‌తో కలిసి నేహా శెట్టి నటిస్తోన్న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs of Godavari) సినిమా త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాలోని ‘సుట్టంలా సూసి పోకలా..’ పాట లిరికల్ సాంగ్ ట్రెండ్ సెట్ చేస్తోన్న విషయం తెలియంది కాదు.


Neha-Shetty.jpg

టాలీవుడ్ అగ్రగామి సంస్థలలో ఒకటైన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాని నిర్మిస్తుండగా.. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కూడా కచ్చితంగా హిట్ అవుతుందనేలా ఇప్పటికే క్రేజ్‌ని సొంతం చేసుకుంది. ఇలా ఆడియెన్స్ నుంచి దక్కుతున్న ఆదరణ, టాలీవుడ్ తనపై పెట్టుకున్న నమ్మకంతో క్రేజీ లైనప్ చేసుకుంటోంది నేహా శెట్టి. మంగళవారం (డిసెంబర్ 5) నేహాశెట్టి పుట్టినరోజు. ఆమె పుట్టినరోజును పురస్కరించుకుని సోషల్ మీడియా వేదికగా నేహాశెట్టికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. (HBDNehaShetty)


ఇవి కూడా చదవండి:

====================

*‘బై వన్‌ టికెట్.. గెట్‌ వన్‌ ఫ్రీ’.. నిర్మాత బంపరాఫర్

*****************************************

*Charan Arjun: రేవంత్ రెడ్డి విజయం నూతన ఉత్సాహాన్ని ఇచ్చింది

***********************************

*Anasuya: ఓటమిని ఒప్పుకున్న కేటీఆర్.. ప్రేమలో పడ్డానంటూ అనసూయ ట్వీట్

***********************************

Updated Date - 2023-12-05T15:31:11+05:30 IST