సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Nidhhi Agerwal: ‘హరిహర వీరమల్లు’లో నటిస్తున్న నిధి.. సంచలన నిర్ణయం

ABN, First Publish Date - 2023-05-01T17:57:54+05:30

‘హరిహర వీరమల్లు’లో నటిస్తున్న నిధి అగర్వాల్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ సినిమా తర్వాత ఇకపై..

Heroine Nidhhi Agerwal
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాను ఇప్పటివరకు నటించిన చిత్రాల్లో తన పాత్రలన్నీ గ్లామర్‌కే పరిమితమై ఉన్నాయని యంగ్‌ హీరోయిన్‌ నిధి అగర్వాల్‌ (Nidhhi Agerwal) తన మనసులోని మాటను వెల్లడించారు. నాగచైతన్య (Naga Chaitanya) నటించిన ‘సవ్యసాచి’ (Savyasachi) చిత్రం ద్వారా టాలీవుడ్‌‌లోకి, శింబు నటించిన ‘ఈశ్వరన్‌’ (Eeswaran) చిత్రం ద్వారా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నిధి అగర్వాల్‌... ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇప్పటివరకు సాగిన సినీ జర్నీపై తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

తన సినీ జర్నీపై హీరోయిన్ నిధి అగర్వాల్‌ (Heroine Nidhhi Agerwal) స్పందిస్తూ.. ‘‘ఇప్పటివరకు నేను పోషించిన పాత్రలన్నీ గ్లామర్‌ (Glamour)కే పరిమితమయ్యాయి. తొలిసారి తెలుగులో పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ (Powerstar Pawan Kalyan)తో నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu) మూవీలో ఓ మంచి పాత్రను పోషిస్తున్నా. నా కెరీర్‌లోనే ఇది చాలా ప్రత్యేకమైన పాత్ర. నేను వెండితెరపై అందంగా ఉండాలన్న విషయంపైనే ఇప్పటి వరకు ఎక్కువగా దృష్టిసారించా. ఇక మంచి కథా పాత్రల ఎంపికపై శ్రద్ధ చూపిస్తా. కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నా. నటనలో నేను మాత్రమే కాదు ఎవ్వరు కూడా పూర్తిగా తెలిసినవారు లేరు. నటన పరంగా అన్ని విషయాలు ఏ ఒక్కరికీ తెలియదు. పాత్రను అర్థం చేసుకుని నటించాలన్న అంశంపై దృష్టిపెట్టా. మంచి ప్రతిభ కలిగిన దర్శకుల చిత్రాల్లో నటించాలని ఆశపడుతున్నా. ఓటీటీలో వచ్చే సినిమాలు చూస్తూ నన్ను నేను నటన (Acting)లో మెరుగు పరుచుకుంటున్నా..’’ అని నిధి అగర్వాల్‌ వివరించింది.

అయితే నిధి అగర్వాల్‌కు కోలీవుడ్ (Kollywood) ఏమోగానీ గానీ.. టాలీవుడ్‌లో మాత్రం ‘ఇస్మార్ట్ శంకర్’ (Ismart Shankar) వంటి మంచి హిట్ బొమ్మ ఉంది. కానీ, ఆ హిట్టును ఆమె సక్సెస్‌ఫుల్‌గా వినియోగించుకోవడంలో మాత్రం రాంగ్ స్టెప్ వేసింది. ఆ సినిమా తర్వాత ఆమెకు ‘మిస్టర్ మజ్ను’ (Mr. Majnu), ‘హీరో’ (Hero) వంటి చిత్రాలలో మాత్రమే అవకాశాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా విజయం సాధించలేకపోయాయి. కానీ ఆమెకు పవర్ స్టార్ సరసన నటించే ఛాన్స్‌ను మాత్రం తెచ్చిపెట్టాయి. పవన్ కల్యాణ్, క్రిష్ (Krish) కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో ఆమె హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా విడుదల తర్వాత ఆమెకు వరుస ఆఫర్లు వస్తాయనే భావనలో నిధి ఉంది. అయితే ఆ సినిమా ఎప్పుడు పూర్తవుతుందనేది మాత్రం ఇప్పుడప్పుడే వెల్లడయ్యే అవకాశం అయితే లేదు.

ఇవి కూడా చదవండి:

************************************************

*Anushka: ‘మిస్ శెట్టి’.. ప్రభాస్‌ని భలే బుక్ చేసిందిగా.. ఇక నలుగురిలో తిరగగలడా?

*Bholaa Shankar: వింటేజ్ లుక్‌లో మెగాస్టార్.. సోషల్ మీడియా షేక్

*Miss Shetty Mr Polishetty Teaser Talk: మీ టైమింగ్ ఎప్పుడూ ఇంతేనా?

*Director Teja: బాలీవుడ్ సినిమాని చంపింది.. టాలీవుడ్ సినిమాని చంపబోతోందీ అదే!

*Nani 30: ‘నాని 30’లో చిరు, బాలయ్య సినిమాల్లో చేసిన హీరోయిన్

Updated Date - 2023-05-01T17:57:54+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!