Yendira Ee Panchayithi: ఆసక్తికరంగా ‘ఏందిరా ఈ పంచాయితీ’ ఫస్ట్ లుక్

ABN , First Publish Date - 2023-08-17T22:33:09+05:30 IST

ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రదీప్ కుమార్.ఎం నిర్మిస్తున్న సినిమా ‘ఏందిరా ఈ పంచాయితీ’. గంగాధర.టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. భరత్, విషికా లక్ష్మణ్‌లు ఈ చిత్రంతో హీరో హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. హీరో హీరోయిన్ ఓ గోడ మీద కూర్చొని ముచ్చటించుకుంటున్నట్లుగా ఈ పోస్టర్ ఉంది.

Yendira Ee Panchayithi: ఆసక్తికరంగా ‘ఏందిరా ఈ పంచాయితీ’ ఫస్ట్ లుక్
Yendira Ee Panchayithi First Look

డిఫరెంట్ కంటెంట్, అంతకుమించి డిఫరెంట్‌గా టైటిల్.. ఇదే ఈ తరం ప్రేక్షకలోకం కోరుకునే సినిమా. స్టార్ హీరో హీరోయిన్స్ సంగతి పక్కనబెట్టి రియాలిటీకి దగ్గరగా ఉండే సినిమాలకే ఆడియన్స్ ఓటేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఫారిన్ లొకేషన్స్‌లో తీసే సినిమాలకంటే మన ఊరి వాతావరణంలో తీసే సినిమాలకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. లోకల్ లాంగ్వేజ్, లోకల్ అడ్డాలనే తెగ ప్రేమిస్తున్నారు. అయితే నేటితరం ప్రేక్షకుల టేస్ట్‌కి అనుగుణంగా వీటన్నింటినీ కలగలుపుతూ తీసిన సినిమానే ‘ఏందిరా ఈ పంచాయితీ’ (Yendira Ee Panchayithi) అని అంటున్నారు మేకర్స్. ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రదీప్ కుమార్.ఎం నిర్మిస్తున్న సినిమా ‘ఏందిరా ఈ పంచాయితీ’. గంగాధర.టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. భరత్, విషికా లక్ష్మణ్‌లు ఈ చిత్రంతో హీరో హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. రీసెంట్‌గా ఈ చిత్రం నుంచి విడుదల చేసిన టైటిల్ లోగో అందరినీ ఆకట్టుకుంది. ఊర్లోని వాతావరణాన్ని, చిన్న గొడవలు, కులవృత్తులను తెలియజేసేలా కొన్ని సంకేతాలను వదిలారు. ఇలా టైటిల్ పోస్టర్‌తోనే సినిమాపై అంచనాలు పెంచిన మేకర్స్ తాజాగా చిత్ర ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. (Yendira Ee Panchayithi First Look)


Yendira-Ee.jpg

ఈ పోస్టర్ చూస్తుంటే.. ఈ సినిమాతో ఓ కంప్లీట్ విలేజ్ స్టోరీని తెరపైకి తీసుకొచ్చారనేది అర్థమవుతోంది. ఊరి చివర సహజమైన వాతావరణంలో హీరో హీరోయిన్ ఓ గోడ మీద కూర్చొని ముచ్చటించుకుంటున్నట్లుగా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఉంది. ఈ పోస్టర్ చూస్తుంటే హీరో హీరోయిన్ గాఢమైన ప్రేమలో అస్సలు సంబంధం లేని ఎన్నో పంచాయితీలు చోటు చేసుకుంటాయని.. ఈ పంచాయితీల చుట్టే ఈ కథ తిరుగుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్ర విడుదల తేదీని త్వరలోనే మేకర్స్ ప్రకటించనున్నారు.


ఇవి కూడా చదవండి:

***************************************

*Tiger Nageswara Rao: టైగర్ ఇన్వెజన్.. దురదృష్టవశాత్తూ వాడొక క్రిమినల్ అయ్యాడు.. లేదంటేనా?

****************************************

*Anil Sunkara: మెగాస్టార్‌తో వివాదంపై క్లారిటీ.. నా శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు

****************************************

*Sunny Deol: ఈ స్థాయి సక్సెస్‌ని అస్సలు ఊహించలేదు..

****************************************

*Gangs of Godavari: ‘సుట్టంలా సూసి’.. పబ్లిగ్గా రచ్చ రచ్చ చేసిన విశ్వక్, నేహా శెట్టి


***************************************

Updated Date - 2023-08-17T22:33:09+05:30 IST