సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

BoyapatiRAPO: పోస్టర్ అదిరింది.. ఫస్ట్ థండర్ ఎప్పుడంటే..?

ABN, First Publish Date - 2023-05-13T15:41:14+05:30

తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదలకు సంబంధించిన వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. #BoyapatiRAPO ఫస్ట్ థండర్‌ (First Thunder) పేరుతో రామ్ పుట్టినరోజున

Ram Pothineni in BoyapatiRapo Film
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Sreenu), ఉస్తాద్ రామ్ పోతినేని (Ustaad Ram Pothineni)ల క్రేజీ ప్రాజెక్ట్ #BoyapatiRAPO ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. అన్ని కమర్షియల్ అంశాలతో కూడిన యాక్షన్, మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ (Srinivasaa Silver Screen) బ్యానర్‌పై.. భారీ బడ్జెట్‌తో శ్రీనివాస చిట్టూరి (Srinivasaa Chitturi) ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదలకు సంబంధించిన వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. #BoyapatiRAPO ఫస్ట్ థండర్‌ (First Thunder) పేరుతో రామ్ పుట్టినరోజు (Ram Birthday) (మే 15)న టీజర్‌ను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటిస్తూ.. ఓ పవర్‌ఫుల్ పోస్టర్‌ని విడుదల చేశారు.

ఈ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో రామ్ డాషింగ్ అండ్ డైనమిక్‌గా కనిపిస్తున్నారు. స్టైలిష్ హెయిర్‌డో, మందపాటి గడ్డం రగ్గడ్ నెస్‌ని తీసుకొచ్చింది. డెనిమ్ షర్ట్, జీన్స్ ధరించి రామ్ తన చేతిలో బేస్ బాల్ బ్యాట్‌తో ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నారు. బ్యాగ్రౌండ్‌లో పెద్ద దున్నపోతును కూడా చూడవచ్చు. ఈ సినిమాలో మాసీవ్ క్యారెక్టర్‌లో నటించేందుకు రామ్ బీస్ట్ లుక్‌లో కనిపించారు. ఈ పోస్టర్ (#BoyapatiRAPO Movie Poster) చూసిన వారంతా.. లుక్ అదిరింది అంటూ కామెంట్స్ చేస్తుండటం విశేషం. కాగా.. ఫస్ట్ థండర్‌ని మే 15న ఉదయం గం. 11:25 ని.లకు విడుదల చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు.

రామ్‌కు జోడీగా హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల (Sreeleela) నటిస్తోన్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో.. ప్రముఖ నటీనటులెందరో నటిస్తున్నారు. వారి వివరాలను త్వరలోనే మేకర్స్ తెలియజేయనున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్. థమన్ (S Thaman) సంగీతం అందిస్తోన్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 20న హిందీ‌తో పాటు అన్ని దక్షిణాది భారతీయ భాషల్లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ‘అఖండ’ (Akhanda) తర్వాత బోయపాటి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొని ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

************************************************

*PVT04: ‘చిత్ర’గా శ్రీలీల.. లుక్ విడుదల

*Ustaad Bhagat Singh: బాబాయ్ మూవీ గ్లింప్స్‌పై అబ్బాయ్ రియాక్షన్ ఇదే..

*Bandla Ganesh: బానిసత్వానికి భాయ్ భాయ్.. మళ్లీ రాజకీయాల్లోకి వస్తా..

*SPY: నిఖిల్ ‘స్పై’ టీజర్‌ని ఎక్కడ విడుదల చేస్తున్నారో తెలుసా?

*Ileana: బంప్ అలెర్ట్.. అంటూ ఇలియానా సోషల్ మీడియాలో రచ్చ రచ్చ

Updated Date - 2023-05-13T15:41:14+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!