C.D: ఈసారి అదా శర్మ భయపెడతానంటోంది

ABN , First Publish Date - 2023-08-18T22:46:36+05:30 IST

హారర్ జానర్ చిత్రాలకు ప్రత్యేకంగా అభిమానులుంటారు. వారిలో క్లాస్, మాస్ అనే తేడాలేం ఉండవ్. ఈ జానర్‌లో వచ్చిన ఎన్నో సినిమాలు ఆడియన్స్‌ని థ్రిల్ చేశాయి. కాస్త వైవిధ్యంగా ఉంటే చాలు సూపర్ డూపర్ హిట్స్ కూడా అయ్యాయి. ఇప్పుడు అదే బాటలో సరికొత్తగా సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ ‘C.D’ రాబోతోంది. అదా శర్మ లీడ్ పాత్రలో నటిస్తోన్న ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు.

C.D: ఈసారి అదా శర్మ భయపెడతానంటోంది
Adah Sharma in CD Film

హారర్ జానర్ చిత్రాలకు ప్రత్యేకంగా అభిమానులుంటారు. వారిలో క్లాస్, మాస్ అనే తేడాలేం ఉండవ్. ఈ జానర్‌లో వచ్చిన ఎన్నో సినిమాలు ఆడియన్స్‌ని థ్రిల్ చేశాయి. కాస్త వైవిధ్యంగా ఉంటే చాలు సూపర్ డూపర్ హిట్స్ కూడా అయ్యాయి. ఇప్పుడు అదే బాటలో సరికొత్తగా సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ (Psychological Horror Thriller) మూవీ ‘C.D’ రాబోతోంది. ఇప్పటి వరకు వచ్చిన హారర్ జానర్స్‌లోకెల్లా ఆడియన్స్‌కి డిఫరెంట్ అనుభూతి కలిగించే స్టోరీతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా మేకర్స్ చెబుతున్నారు. రీసెంట్‌గా ‘ది కేర‌ళ స్టోరీ’ (The Kerala Story) మూవీతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న అదా శర్మ (Adah Sharma) ఈ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తోంది.


C.D (క్రిమినల్ ఆర్ డెవిల్) అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు కృష్ణ అన్నం దర్శకత్వం వహిస్తున్నారు. SSCM ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతుండగా గిరిధర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. RR ధృవన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ క్రమంలోనే చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. అదా శర్మ కీలక పాత్రలో నటిస్తోన్న ఈ సినిమాలో విశ్వంత్, జబర్దస్త్ రోహిణి, భరణి శంకర్, రమణ భార్గవ్, మహేష్ విట్టా వంటి వారు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. (Adah Sharma First Look From CD Out)

adah.jpg

ఇక ఫస్ట్ లుక్ విషయానికి వస్తే.. ఫస్ట్ లుక్‌తోనే మేకర్స్ భయపెట్టేస్తున్నారు. అదా శర్మ సీరియస్ లుక్‌, ఆ చుట్టూ డెవిల్స్ హ్యాండ్స్ కనిపిస్తుండటం చిత్రంలోని వైవిధ్యాన్ని తెలుపుతున్నాయి. C.D అనే టైటిల్ క్రిమినల్ ఆర్ డెవిల్ అనే ట్యాగ్‌లైన్‌తో పోస్టర్ చూడగానే సినిమాపై ఆసక్తి నెలకొనేలా ఈ ఫస్ట్ లుక్‌ను డిజైన్ చేశారు. ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడంలో కొత్త దారిలో వెళుతున్నాం అని పోస్టర్ ద్వారా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని పనులు ఫినిష్ చేసి అతి త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు.

Devil.jpg


ఇవి కూడా చదవండి:

***************************************

*Skanda: ‘గందారబాయి’ అంటూ.. రామ్, శ్రీలీల ఓ ఊపు ఊపేశారు

***************************************

*Sampath Nandi: ‘సౌండ్ పార్టీ’.. మరో ‘జాతిరత్నాలు’ అయ్యే సినిమా..

***************************************

*Dulquer Salmaan: ప్రభాస్ ‘కల్కి’లో దుల్కర్.. చెప్పకనే చెప్పేశాడుగా..

***************************************

*Aadikeshava: మెగా హీరో సినిమా వాయిదా.. న్యూ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

***************************************

Updated Date - 2023-08-18T22:48:25+05:30 IST