CID: ‘సీఐడీ’ నిర్మాత మృతి.. నా జీవితంలో మంచి శకం ముగిసిందంటూ..
ABN , First Publish Date - 2023-03-14T11:46:53+05:30 IST
గత కొంతకాలంగా పలు సినీ పరిశ్రమలకి చెందిన ప్రముఖులు మృత్యువాతపడడం తెలిసిందే.
![CID: ‘సీఐడీ’ నిర్మాత మృతి.. నా జీవితంలో మంచి శకం ముగిసిందంటూ..](https://media.chitrajyothy.com/media/2023/20230303/pradeep_84690d1194.jpg)
గత కొంతకాలంగా పలు సినీ పరిశ్రమలకి చెందిన ప్రముఖులు మృత్యువాతపడడం తెలిసిందే. టాలీవుడ్‌లో తారకరత్న, కోలీవుడ్‌లో మైల్‌సామీ, అలాగే బాలీవుడ్‌లో సతీష్ కౌశిక్.. ఇలా వరుసగా పలువురు ప్రముఖులు కన్నుమూశారు. తాజాగా మరో బాలీవుడ్ ప్రముఖ నిర్మాత ప్రదీప్ ఉప్పూర్ (Pradeep Uppoor) మరణించారు.
ఎన్నో కేసులను సునాయాసంగా ఛేదించే ‘సీఐడీ’ (CID) పేరుతో ఓ సీరియల్ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఆ ధారావాహిక నిర్మాతే ప్రదీప్ ఉప్పూర్. హిందీలో తెరకెక్కిన ఈ సీరియల్ తెలుగు వంటి ఇతర ప్రాంతీయ భాష్లల్లోకి సైతం డబ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. కాగా.. ప్రదీప మరణవార్తను.. ‘సీఐడీ’లో 20 ఏళ్ల పాటు ఏసీపీ ప్రద్యుమ్నగా నటించిన శివాజీ సతం (Shivaji Satam) సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
శివాజీ షేర్ చేసిన పోస్టులో.. ప్రదీప్ ఉప్పూర్‌నే సిఐడి నిర్మాత. మూలస్తంభం. ఎప్పుడూ నవ్వుతూ ఉండే వ్యక్తి, నా ప్రియ మిత్రుడు. నిజాయతీపరుడు. చాలా మంచి వ్యక్తి. మీ వెళ్లిపోవడంతో నా జీవితంలోని సుదీర్ఘమైన అద్భుత అధ్యాయం ముగిసింది బాస్. లవ్ యూ & మిస్ యూ, మిత్రమా’ అని రాసుకొచ్చాడు. ఈ పోస్ట్‌పై సీఐడీలో ఫోరెన్సిక్ నిపుణుడు డాక్టర్ సలుంఖే పాత్రలో నటించిన నరేంద్ర గుప్తా స్పందించారు. ‘ఇది చాలా షాకింగ్ న్యూస్. నాకు ఆయనతో సుదీర్ఘమైన బంధం ఉంది. ఆయన ఎంతో అద్భుతమైన వ్యక్తి. మీ ఆత్మకు శాంతి చేకూరాలి ప్రదీప్ భాయ్’ అని రాసుకొచ్చారు. అలాగే.. ‘సీఐడీ’ అభిమానులు సైతం తమ బాధను వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Oscars 2023: భుజంపై పులి బొమ్మతో ఎన్టీఆర్.. నిర్వాహకులు అడిగితే.. యంగ్ టైగర్ జవాబుకి అందరూ ఫిదా..
SIR OTT Streaming: ఓటీటీలో క్లాస్ తీసుకోడానికి సిద్ధమైన ధనుష్..
Rana Naidu Webseries: ఛీఛీ.. ఇలా చేశారేంటి?.. దగ్గుబాటి హీరోలని ఆడేసుకుంటున్న నెటిజన్లు
NTR: ఏ హీరో ఇష్టపడని పాత్రలో అదరగొట్టిన ఎన్‌టీఆర్.. ఏం చేసినా అంతే..
Writer Padmabhushan OTT Streaming: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..
Anicka: హీరోయిన్‌ని ముఖం వాచిపోయేలా కొట్టిన మాజీ ప్రియుడు.. అసలు విషయం ఏమిటంటే?