Salman Khan: బాలీవుడ్ స్టార్ మూవీలో అతిథి పాత్రలో రామ్‌చరణ్!?.. ‘ఏంటమ్మా’ అంటూ..

ABN , First Publish Date - 2023-04-03T17:16:10+05:30 IST

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌ (Salman Khan)కి, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), రామ్‌చరణ్ (Ram Charan) కుటుంబాలకి మధ్య మంచి సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే.

Salman Khan: బాలీవుడ్ స్టార్ మూవీలో అతిథి పాత్రలో రామ్‌చరణ్!?.. ‘ఏంటమ్మా’ అంటూ..
Salman Khan

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌ (Salman Khan)కి, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), రామ్‌చరణ్ (Ram Charan) కుటుంబాలకి మధ్య మంచి సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. అందుకే మెగాస్టార్ హీరోగా నటించిన ‘గాడ్ ఫాదర్’ చిత్రంలో సల్మాన్ ఖాన్ ప్రత్యేక పాత్రలో కనిపించాడు. అందుకే తన సినిమాలో రామ్ ‌చరణ్‌ని నటింపజేసేందుకు సల్మాన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. సల్మాన్ ప్రస్తుతం ‘కిసి కా భాయ్ కిసి కా జాన్’ సినిమా చేస్తున్నాడు. అందులో టాలీవుడ్ హీరో వెంకటేశ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఆ చిత్రంలోనే రామ్‌చరణ్ అతిథి పాత్రలో కనిపంచనున్నట్లు ప్రచారం జరిగింది.

‘కిసి కా భాయ్ కిసి కా జాన్’ (KisiKaBhaiKisiKiJaan)ఓ పాటలో చెర్రీ మెరవనున్నట్లు ప్రచారం జరగుతోంది. ఈ తరుణంలోనే ఈ పాటకి సంబంధించిన టీజర్‌ని మూవీ టీం విడుదల చేసింది. ‘ఎంటమ్మా’ అని సాగే ఈ పాటని రేపు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. ఆ టీజర్‌లో సల్మాన్, వెంకీ మామ పసుపు రంగు చొక్కాలో తెల్ల పంచలో కనిపించారు. పండగ వాతావరణంలా ఉన్న వారిద్దరూ ఓ స్టేజ్‌పై వారిద్దరూ నవ్వుతూ చూస్తుండగా.. ఓ వ్యక్తి ఆ స్టేజ్‌పైకి వెళుతుంటాడు. అయితే.. ఆ వ్యక్తి ఎవరనేది మాత్రం రేపటి విడుదల కాబోయే పాటలో చూడాల్సిందే. అయితే.. అంత ప్రత్యేకంగా చూపిస్తున్నారంటే.. అ వ్యక్తి కచ్చితంగా రామ్‌చరణ్ అయ్యి ఉంటాడని వార్తలు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో.. #SalmanKhan, #Venktesh, #KisiKaBhaiKisiKiJaan తో పాటు #Ramcharan యాష్ ట్యాగ్లు ట్రెండింగ్ అవుతున్నాయి. అతను రామ్‌చరణ్‌నే అని పలువురు వరుసగా పోస్టులు పెడుతున్నారు.

కాగా.. ‘కిసి కా భాయ్ కిసి కా జాన్’ చిత్రంలో బతుకమ్మ ఆడిన పాట ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఓ బాలీవుడ్‌ మూవీలో తెలంగాణకి సంబంధించిన బతుకమ్మ సాంగ్ ఉండడంతో టాలీవుడ్ ప్రేక్షకులు సంబరపడిపోయారు. ఆ పాటకి యూట్యూబ్‌లో మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. దీంతో రేపు విడుదల కాబోయే పాటలో రామ్‌చరణ్ గనుక కనిపిస్తే.. ఆ పాట అన్ని రికార్డులను బద్దలుకొట్టే అవకాశం లేకపోలేదు. (Ram Charan in Kisi Ka Bhai Kisi Ki Jaan)


ఇవి కూడా చదవండి:

Balagam: అసాంఘిక శక్తుల వల్ల మాకు నష్టం వస్తోంది.. దిల్‌రాజు కంప్లైంట్

Kangana Ranaut: తనని ట్రోల్ చేయమంటున్న కంగనా.. దేనికోసమంటే..

Janhvi Kapoor: తిరుమలలో బాయ్‌ఫ్రెండ్‌తో జూనియర్ శ్రీదేవి.. తర్వాత అడుగు అటువైపేనా?

Varun Dhawan: స్టేజీపై మోడల్‌కు ముద్దు పెట్టినందుకు ట్రోలింగ్.. వెటకారంగా రిప్లై ఇచ్చిన యంగ్ హీరో

Salman Khan: హీరోయిన్‌కి ముద్దు ఇచ్చిన స్టార్ హీరో.. ఆ తర్వాత పక్కకి వెళ్లి ఏం చేశాడో తెలిస్తే..

Bholaa: మరో సౌత్ సూపర్‌హిట్ మూవీని చెడగొట్టిన బాలీవుడ్.. ఆ మూవీ ఫ్లాప్‌కి కారణాలివే..

Updated Date - 2023-04-03T17:27:53+05:30 IST