సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Salman Khan: బెదిరింపుల నేపథ్యంలో బుల్లెట్ ఫ్రూప్ కారు కొనుగోలు

ABN, First Publish Date - 2023-04-07T15:35:55+05:30

బాలీవుడ్ సూపర్ స్టార్స్‌లో సల్మాన్ ఖాన్ (Salman Khan) ఒకరు. ఆయన నుంచి సినిమా వస్తుందంటే చాలు అభిమానులందరు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. సల్మాన్‌కు కొంత కాలంగా లారెన్స్ బిష్ణోయ్ వంటి ఆగంతకుల నుంచి బెదిరింపులు వస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ సూపర్ స్టార్స్‌లో సల్మాన్ ఖాన్ (Salman Khan) ఒకరు. ఆయన నుంచి సినిమా వస్తుందంటే చాలు అభిమానులందరు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. సల్మాన్‌కు కొంత కాలంగా లారెన్స్ బిష్ణోయ్ వంటి ఆగంతకుల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. కొంత మంది చంపేస్తామంటూ క్షమాపణలు చెప్పాలని ఇమెయిల్ పంపించారు. క్షమాపణలు చెప్పకపోతే ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఫలితంగా అధికారులు సల్మాన్ ఇంటి చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. అయినప్పటికీ సల్మాన్ ఖాన్ భద్రతా కారణాల రీత్యా హై ఎండ్ బుల్లెట్ ప్రూఫ్ కారును కొనుగోలు చేశారు.

సల్మాన్ ఖాన్ కొత్తగా బుల్లెట్ ఫ్రూప్ పెట్రోల్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్‌ (ఎస్‌యూవీ) ను కొన్నారు. ఈ కారు ఇండియన్ మార్కెట్‌లో ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు. నిస్సాన్ కంపెనీ రూపొందించిన ఎస్‌యూవీల్లో అత్యంత ఖరీదైన కారు ఇదేనట. భద్రత కూడా బీ6 లేదా బీ7 ఉంటుందని సమాచారం. బీ6లో 41ఎమ్‌ఎమ్ మందపాటి గ్లాస్, బీ7లో 78ఎమ్‌ఎమ్ మందంతో కూడిన గ్లాస్ ఉంటుంది. ఫలితంగా బుల్లెట్స్ లోపలకు చొరబడలేవు.

ఇక సల్మాన్ ఖాన్ కెరీర్ విషయానికి వస్తే.. చివరగా ‘పఠాన్’ (Pathaan) లో అతిథి పాత్రను పోషించారు. తాజాగా ‘కిసీ కా భాయ్, కిసీ కీ జాన్’ (Kisi Ka Bhai Kisi Ki Jaan)లో నటించారు. ఈ సినిమాలో పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్‌గా నటించారు. జగపతి బాబు, విక్టరీ వెంకటేశ్, భూమిక, షెహనాజ్ గిల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రామ్ చరణ్ అతిథి పాత్రలో తళుక్కున మెరిశారు. ఈ మూవీ రంజాన్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

Salman Khan: యంగ్ హీరోలపై షాకింగ్ కామెంట్స్

Chor Nikal Ke Bhaga: ‘ఆర్ఆర్ఆర్’ రికార్డును చెరిపేసిన బాలీవుడ్ సినిమా

MM. Keeravani: బాలీవుడ్ సినిమాకు సంగీతం.. హీరో ఎవరంటే..?

Koffee With Karan: భార్యతో కలిసి రావాలంటూ సౌత్ స్టార్ హీరోలకు పిలుపు.. బుక్ చేస్తాడేమో చూసుకోండి..

Web Series: భారత్‌లో ఎక్కువ మంది వీక్షించిన వెబ్ సిరీస్ ఏంటో తెలుసా..?


Updated Date - 2023-04-07T15:36:54+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!