Jawan: మ‌రోసారి లుంగీ డ్యాన్స్‌తో.. ఈసారి దుమ్ములేచిపోవడం ఖాయం

ABN , First Publish Date - 2023-08-07T16:31:04+05:30 IST

బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్‌కి లుంగీతో ఉన్న అనుబంధం ఎంతో ప్ర‌త్యేక‌మైంది. గ‌తంలో ఆయ‌న హీరోగా న‌టించిన ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ చిత్రంలో లుంగీ డ్యాన్స్ సాంగ్ ఎంత పాపుల‌ర్ అయ్యిందో తెలియంది కాదు. అప్పుడే కాదు తాజాగా ‘జ‌వాన్’ సినిమా నుంచి రిలీజైన దుమ్మే దులిపేలా సాంగ్‌లోనూ లుంగీతో షారుఖ్‌ ఉన్న అనుబంధం ఏంటో క్లారిటీ ఇచ్చారు.

Jawan: మ‌రోసారి లుంగీ డ్యాన్స్‌తో.. ఈసారి దుమ్ములేచిపోవడం ఖాయం
Chennai Express Movie Still

బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్‌ (Shah Rukh Khan)కి లుంగీతో ఉన్న అనుబంధం ఎంతో ప్ర‌త్యేక‌మైంది. గ‌తంలో ఆయ‌న హీరోగా న‌టించిన ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ (Chennai Express) చిత్రంలో లుంగీ డ్యాన్స్ (Lungi Dance) సాంగ్ ఎంత పాపుల‌ర్ అయ్యిందో తెలియంది కాదు. అప్పుడే కాదు తాజాగా ‘జ‌వాన్’ (Jawan) సినిమా నుంచి రిలీజైన దుమ్మే దులిపేలా.. సాంగ్‌లోనూ లుంగీతో షారూఖ్‌కి ఉన్న అనుబంధం మ‌రోసారి తేట తెల్ల‌మైంది. ఈ సాంగ్ మ్యూజిక్ చార్ట్స్‌లో ప్ర‌పంచ వ్యాప్తంగా పాట‌కు త‌గ్గ‌ట్టే నిజంగా టాప్‌లో ఉండి దుమ్ము రేపుతోంది. యాదృచ్చికంగానే జ‌రిగినా లుంగీ క‌ట్టుకుని డ్యాన్స్ చేయ‌టం అనేది షారూఖ్‌కి ల‌క్ అనే చెప్పాలి. షారూక్‌ ఖాన్ ప‌వ‌ర్‌తో పాటు లుంగీ ల‌క్ కూడా తోడైంద‌ని ఫ్యాన్స్ భావిస్తున్నారు.


కేవ‌లం షారూఖ్ మాత్ర‌మే కాదు.. వెనుక ఉండే వెయ్యి మందికి పైగా బ్యాగ్రౌండ్ డ్యాన్స‌ర్స్ సైతం లుంగీ క‌ట్టుకుని డ్యాన్స్ చేయ‌టం వ‌ల్ల పాట‌కు ఓ ప్ర‌త్యేక‌మైన స్టైల్ క్రియేటైంది. ఈ పాట‌లో అనుకోకుండా క‌లిసి వ‌చ్చిన మ‌రో విష‌య‌మేమిటంటే ఇందులో ప్రియ‌మ‌ణి కూడా ఉండ‌టం. ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’లో ఆమె షారూఖ్‌తో క‌లిసి లుంగీ డ్యాన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మ‌రోసారి ఆమె కింగ్ ఖాన్‌తో క‌లిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. 1,2,3,4 గెట్ ఆన్ ది డ్యాన్స్ ఫ్లోర్ అంటూ షారూక్, ప్రియ‌మ‌ణి (Priyamani)ని మ‌రోసారి చూసి ఫ్యాన్స్ ఎంజాయ్ చేయ‌బోతున్నారు.

SRK.jpg

లార్జ‌ర్ దేన్ లైఫ్ విజువ‌ల్స్‌, పాజిటివ్ ఎన‌ర్జీతో ఈ పాట షారూఖ్‌కి మ్యూజిక్‌పై ఉన్న క‌నెక్ష‌న్‌ను ఎలివేట్ చేస్తోంది. ఈ పాట‌కు 24 గంట‌ల్లోనే 46 మిలియ‌న్ వ్యూస్ రావ‌టం టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది. ‘జవాన్’ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్మెంట్ (Red Chillies Entertainment) బ్యాన‌ర్‌పై అట్లీ (Atlee) ద‌ర్శ‌క‌త్వంలో గౌరీ ఖాన్ నిర్మిస్తున్నారు. గౌర‌వ్ వ‌ర్మ ఈ సినిమాకు స‌హ నిర్మాత‌. సెప్టెంబ‌ర్ 7న ‘జ‌వాన్‌’ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, త‌మిళ భాషల్లో రిలీజ్ కాబోతోంది.


ఇవి కూడా చదవండి:

***************************************

*Samantha: రూ. 25 కోట్లా? నేనూ వర్క్ చేశా.. అందుకు రాళ్లూరప్పలేం ఇవ్వలేదు

***************************************

*Bro: ఫ్యామిలీ ఆడియన్స్‌‌ కనెక్ట్ అయ్యారు.. ఈ వారం కూడా ‘బ్రో’దే బ్రో!


***************************************

*Dayaa: డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్‌లో ‘దయా’ దండయాత్ర మొదలైంది

***************************************

*Kangana Ranaut: ‘చంద్రముఖి 2’లో కంగనా రనౌత్ లుక్ వచ్చేసింది

**************************************

Updated Date - 2023-08-07T16:31:04+05:30 IST