Naatu Naatu: పాటతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్న కరీనా కపూర్

ABN , First Publish Date - 2023-03-20T18:57:24+05:30 IST

‘ఆర్ఆర్ఆర్’ (RRR) లోని ‘నాటు నాటు’ (Naatu Naatu) క్రేజ్ ఖండంతరాలను దాటింది. ఈ సాంగ్‌కు ఇండియన్స్‌తో పాటు వెస్ట్రన్స్ కూడా స్టెప్పులేస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా అందరు ఈ పాటకు ఫిదా అయ్యారు.

Naatu Naatu: పాటతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్న కరీనా కపూర్

‘ఆర్ఆర్ఆర్’ (RRR) లోని ‘నాటు నాటు’ (Naatu Naatu) క్రేజ్ ఖండంతరాలను దాటింది. ఈ సాంగ్‌కు ఇండియన్స్‌తో పాటు వెస్ట్రన్స్ కూడా స్టెప్పులేస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా అందరు ఈ పాటకు ఫిదా అయ్యారు. ఈ సాంగ్‌తో తనకెంతో అనుబంధం ఉందని కరీనా కపూర్ (Kareena Kapoor) తెలిపారు. అందుకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు.

బాలీవుడ్ నటి కరీనా కపూర్‌కు ఇద్దరు పిల్లలున్నారు. ఆమె చిన్న కుమారుడు జహంగీర్ (Jehangir)కు ‘నాటు నాటు’ అంటే ఎంతో ఇష్టమట. రాత్రి భోజనం వేళలో ఈ పాట వినిపిస్తేనే జహంగీర్ భోజనం చేస్తాడని ఆమె తెలిపారు. ఒరిజినల్ వెర్షన్‌ను మాత్రమే జహంగీర్ వింటాడని, హిందీ డబ్బింగ్ వెర్షన్ అస్సలు ఇష్టముండదని పేర్కొన్నారు. ఈ పాట ఆస్కార్ అవార్డును గెలుచుకోవడం తనకెంతో సంతోషంగా ఉందని ఆమె చెప్పారు. సినీ ఇండస్ట్రీకి చెందిన సభ్యురాలిగా తాను గర్విస్తున్నానని స్పష్టం చేశారు. ‘‘ప్రేక్షకులు ఎక్కువగా సినిమాలను చూస్తుంటే నేను గర్విస్తున్నాను. హిందీ చిత్రాలు, ప్రాంతీయ భాష చిత్రాలు, డాక్యుమెంటరీలు ఏవైనా సరే ప్రేక్షకులు వీక్షించడం బాగుంది. ప్రజలు ఇండియన్ సినిమాలను సీరియస్‌గా తీసుకుంటున్నారు. ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అని కరీనా కపూర్ తెలిపారు. ‘ఆర్ఆర్ఆర్’ లోని ‘నాటు నాటు’ అనేక ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో సత్తా చాటింది. గోల్డెన్ గ్లోబ్ పురస్కారాన్ని గెలుచుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’ ఆస్కార్ అవార్డును కూడా కైవసం చేసుకుంది.

విప్లవ కారులైన కొమరం భీమ్, అల్లూరి సీతా రామరాజు‌ల స్ఫూర్తితో ‘ఆర్ఆర్ఆర్’ ను రూపొందించారు. ఈ చిత్రానికి కీరవాణి మ్యూజిక్ అందించారు. ‘నాటు నాటు’ ను చంద్రబోస్ రచించారు. కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ అలపించారు.

^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Suriya: ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిన సూర్య.. ధర వింటే షాకే..

Naatu Naatu: పాటపై సంచలన కామెంట్స్ చేసిన కీరవాణి తండ్రి శివశక్తి దత్తా

Oscars 2023: షాక్.. ఆస్కార్ వేడుకకు ఫ్రీ పాస్‌లు లేకపోవడంతో.. ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ భారీ ఖర్చు..

RRR: రామ్ చరణ్, తారక్ అందువల్లే ఆస్కార్ స్టేజ్‌పై డ్యాన్స్ చేయలేదు!

Allu Arjun: హీరోయిన్‌ను సోషల్ మీడియాలో బ్లాక్ చేసిన బన్నీ!

Pawan Kalyan: నా రెమ్యునరేషన్ రోజుకు రెండు కోట్లు

Ram Charan: మెగా పవర్ స్టార్ హాలీవుడ్ సినిమా

Updated Date - 2023-03-20T18:57:27+05:30 IST