Jawan: అల్లు అర్జున్ నో.. బాలీవుడ్ హీరో మాత్రం యస్..

ABN , First Publish Date - 2023-03-20T17:24:30+05:30 IST

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan). సినీ ఇండస్ట్రీకి దాదాపు ఐదేళ్లు విరామం ఇచ్చారు. తాజాగా ‘పఠాన్’ (Pathaan) తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది.

Jawan: అల్లు అర్జున్ నో.. బాలీవుడ్ హీరో మాత్రం యస్..

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan). సినీ ఇండస్ట్రీకి దాదాపు ఐదేళ్లు విరామం ఇచ్చారు. తాజాగా ‘పఠాన్’ (Pathaan) తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. వరల్డ్ వైడ్‌గా రూ.1000కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ మూవీ ఇచ్చిన జోష్‌తో కింగ్ ఖాన్ మరో ప్రాజెక్టు చేస్తున్నారు. ‘జవాన్’ (Jawan) లో నటిస్తున్నారు. దక్షిణాదికి చెందిన స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర ఉంది. ఆ పాత్ర కోసం మేకర్స్ విజయ్ (Vijay), అల్లు అర్జున్ (Allu Arjun) లను సంప్రదించారు. కానీ, స్టార్ హీరోలిద్దరు అతిథి పాత్రను చేయడానికి మొగ్గు చూపలేదు. తాజాగా ఆ ప్లేస్‌లోకి మరొకరు వచ్చి చేరారు.

బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ (Sanjay Dutt) ఈ గెస్ట్ రోల్‌ను చేయనున్నారు. అందులో భాగంగా షారూఖ్‌తో పోరాట సన్నివేశాల్లో తలపడనున్నారు. షారూఖ్, సంజయ్ కలసి నాలుగు నుంచి ఐదు రోజుల పాటు షూట్ చేయనున్నారని తెలుస్తోంది. ముంబైలోని ఓ స్టూడియోలో ఈ షూటింగ్ జరగనుందని సమాచారం. ‘జవాన్’ పాన్ ఇండియాగా రూపొందుతుంది. నయనతార (Nayanthar) హీరోయిన్‌గా నటిస్తున్నారు. విజయ్ సేతుపతి (Vijay Sethupathi) విలన్ రోల్‌ను పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని షారూఖ్ సొంత నిర్మాణ సంస్థ రెడ్ ఛిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది. ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా జూన్ 2న విడుదల చేస్తామని గతంలో మేకర్స్ తెలిపారు. కానీ, ఆ సమయానికి సినిమా వచ్చే అవకాశం లేదని బాలీవుడ్ మీడియా తెలుస్తోంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ‘జవాన్’ విడుదల కానుందని సమాచారం.

^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Suriya: ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిన సూర్య.. ధర వింటే షాకే..

Naatu Naatu: పాటపై సంచలన కామెంట్స్ చేసిన కీరవాణి తండ్రి శివశక్తి దత్తా

Oscars 2023: షాక్.. ఆస్కార్ వేడుకకు ఫ్రీ పాస్‌లు లేకపోవడంతో.. ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ భారీ ఖర్చు..

RRR: రామ్ చరణ్, తారక్ అందువల్లే ఆస్కార్ స్టేజ్‌పై డ్యాన్స్ చేయలేదు!

Allu Arjun: హీరోయిన్‌ను సోషల్ మీడియాలో బ్లాక్ చేసిన బన్నీ!

Pawan Kalyan: నా రెమ్యునరేషన్ రోజుకు రెండు కోట్లు

Ram Charan: మెగా పవర్ స్టార్ హాలీవుడ్ సినిమా

Updated Date - 2023-03-20T17:24:32+05:30 IST