రిషబ్‌శెట్టి గురించి ఈ విషయాలు  మీకు తెలుసా.. 

ఒకప్పుడు క్లాప్‌ బాయ్‌గా, వాటర్‌ బాయ్‌గా పనిచేసిన ఆయన సినిమాల్లో ఎన్నో కష్టాలు అనుభవించారు

దూరదర్శన్‌లో వచ్చే రాజ్‌కుమార్‌ సాంగ్స్‌ చూసి ఆయనలా హీరో కావాలనుకున్నారు

హీరో ఉపేంద్ర తమ ప్రాంతానికే చెందిన వ్యక్తే కావడంతో ఆయన స్ఫూర్తితో డైరెక్షన్‌ సైడ్‌  వెళ్లాలనే  ఆశ కలిగింది

డిగ్రీ కోసం ఇంట్లో వాళ్లు బెంగళూరు పంపిస్తే, ఆయన ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లో డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో  చేరారు

 ఎన్నో కష్టనష్టాలు, అనేక ప్రయత్నాలు, వైఫల్యాలు, అవమానాల తర్వాత అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా అవకాశం వచ్చింది

ఆయన  పేరు ప్రశాంత్‌ శెట్టి. సినిమాల్లోకి వచ్చే ముందు ప్రత్యేకమైన పేరును ఎంచుకోవాలని అనుకున్నారు. 

స్నేహితుల సూచనతో రిషబ్‌ శెట్టిగా మార్చుకున్నారు. పేరు మార్చుకున్నాకే నాకు సినిమాల్లో అదృష్టం కలిసొచ్చిందని చెబుతున్నారు.

బెంగళూరులో వాటర్‌ బాయ్‌గా, ఓ  సంస్థలో ఆఫీస్‌ బాయ్‌గా పని చేసిన నేను.. ఢిల్లీలో జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేను.

అదొక తీపి జ్ఞాపకం. లైఫ్‌ టైమ్‌ మెమరీ. ఓ టెక్నీషియన్‌కు ఇంతకన్నా గుర్తింపు ఏముంటుంది

ప్రస్తుతం  ‘జై హనుమాన్‌’, ‘ఛత్రపతి శివాజీ మహారాజ్‌’, బంకించంద్ర ఛటర్జీ నవల ఆనంద్‌మఠ్‌ ఆధారంగా తీసే ‘1770’.. చిత్రాల్లో నటిస్తున్నారు