కృతి సనన్ అందాల విందుకు ఎస్‌ఎమ్ షేక్!

తెలుగు ప్రేక్షకులకు కృతి సనన్ పేరు బాగా పరిచయమే. తెలుగులోనూ ఆమె సినిమాలు చేశారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ‘1 నేనొక్కడినే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.

ఆ తర్వాత అక్కినేని నాగ చైతన్య సరసన ‘దోచేయ్’ మూవీలో ఆమెకు ఛాన్స్ వచ్చింది.

ఈ రెండు సినిమాలు ఆమెను తీవ్ర నిరాశకు గురి చేశాయి. బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్‌గా నిలిచాయి.

దీంతో టాలీవుడ్‌లో చక్రం తిప్పాలనుకున్న ఆమె ఆశలకు గండిపడింది.

టాలీవుడ్‌లో మిస్ అయితేనేం.. బాలీవుడ్‌లో మాత్రం దూసుకెళుతోంది. 

ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస అవకాశాలతో టాప్ హీరోయిన్‌గా చలామణీ అవుతోంది.

మధ్యలో ‘ఆదిపురుష్’ అంటూ మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. 

కానీ, ఆ ప్రయత్నం కూడా బెడిసికొట్టింది. ఆ సమయంలోనే ప్రభాస్‌తో పెళ్లి అంటూ వార్తల్లో నిలిచింది.

ప్రస్తుతం బాలీవుడ్ ప్రాజెక్ట్ ‘కాక్ టైల్ 2’ కోసం ఇలా హాట్ హాట్ పిక్స్‌తో హీట్ పెంచుతోంది.