ఏపీ డిప్యూటీ సీఎం తాలూకా..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా, యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘ఓజీ’

‘సలార్’ చిత్రంలో రాధా రమ మన్నార్ పాత్రలో తన అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు పొందిన శ్రియా రెడ్డి,

 ‘ఓజీ’లో కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు.

2006లో శర్వానంద్ నటించిన అమ్మ చెప్పింది మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది.

వీళ్లది తెలుగు కుటుంబమే అయినా చెన్నైలో స్థిరపడింది. 1982లో భరత్ రెడ్డి దంపతులకు శ్రియా రెడ్డి జన్మించింది.

2008లో నటుడు విశాల్ అన్న విక్రమ్ కృష్ణను పెళ్లి చేసుకోవడం విశేషం.

 తెలుగు, తమిళ సినిమాల్లో ఇప్పటి వరకూ పెద్దగా గుర్తింపు రాకపోయినా..

సలార్, పవన్ కల్యాణ్ ఓజీ సినిమాలతో శ్రియా రెడ్డి పేరు వార్తల్లో నిలుస్తోంది.

సలార్ రెండు భాగాల్లోనూ శ్రియా నటిస్తోంది. రాధా రామ మన్నార్ పాత్రకు మంచి పేరు రావడంతో మరిన్ని అవకాశాలు కూడా ఆమెకు వస్తున్నాయి.