Vasudeva sutam: చంపడం సరదా కాదు.. క్షమించడం చేతకాదు

ABN , Publish Date - Jul 09 , 2026 | 02:36 PM

మాస్టర్ మహేంద్రన్, అంబికా వాణి జంటగా ధనలక్ష్మి బాదర్ల నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘వసుదేవసుతం’.  వైకుంఠ బోను దర్శకత్వం వహించిన ఈ సినిమా జూలై 10న రిలీజ్ కానుంది.

మాస్టర్ మహేంద్రన్, అంబికా వాణి జంటగా ధనలక్ష్మి బాదర్ల  నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘వసుదేవసుతం’ (Vasudeva sutham).  వైకుంఠ బోను దర్శకత్వం వహించిన ఈ సినిమా జూలై 10న రిలీజ్ కానుంది. ఈ తరుణంలో మరింత హైప్ పెంచేందుకు రిలీజ్ ట్రైలర్‌ను తీసుకువచ్చారు. దర్శకుడు అజయ్ భూపతి  ట్రైలర్‌ను విడుదల చేశారు.

‘చంపడం నాకు సరదా కాదు.. అలా అని క్షమించడం చేతకాదు’, ‘కొన్ని తప్పుల్ని క్షమించొచ్చు.. అన్ని తప్పులు క్షమిస్తే.. మనం తప్పు చేసినట్టే’, ‘దేవుడి అస్థిత్వాన్ని ప్రశ్నించే ఎవ్వరికీ భూమ్మీద బతికే హక్కు లేదు’ అనే డైలాగ్స్‌తో సాగిన ఈ ట్రైలర్ అద్భుతంగా ఉంది.  మణిశర్మ ఇచ్చిన బీజీఎం అయితే ట్రైలర్‌లో నెక్ట్స్ లెవెల్లో వినిపిస్తోంది.

Updated Date - Jul 09 , 2026 | 04:37 PM