విజయ్ సేతుపతి ‘ట్రైన్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు!

ABN, Publish Date - Oct 31 , 2026 | 02:38 PM

విజయ్ సేతుపతి నటించిన మిస్కిన్ దర్శకత్వ చిత్రం ‘ట్రైన్’ విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమాను డిసెంబర్ 4న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఈ యేడాది విజయ్‌ సేతుపతి భిన్నమైన చిత్రాలను చేశారు. అందులో సైలెంట్‌ మూవీ 'గాంధీ టాక్స్' ఒకటి. ముంబై నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత వచ్చిన 'బత్తా' చిత్రం కమర్షియల్‌గా మంచి విజయాన్ని అందుకుంది. విజయ్‌ సేతుపతికి నటుడిగా మరింత పేరును ఈ సినిమా తెచ్చిపెట్టింది. ఇక 'జైలర్ 2'లో ఓ ఐదు సెకన్లు మెరుపులా మెరిసిన విజయ్‌ సేతుపతి నటించిన రెండు సినిమాలు ఈ యేడాది విడుదల కావాల్సి ఉన్నాయి. అందులో ఒకటి పూరి జగన్నాథ్‌ తెరకెక్కించిన 'స్లామ్‌ డాగ్‌: 33 టెంపుల్ రోడ్‌' కాగా, మరొకటి మిస్కిన్ డైరెక్ట్ చేసిన 'ట్రైన్' మూవీ. దీనిని డిసెంబర్ 4న విడుదల చేయబోతునట్టు మేకర్స్ తెలియచేస్తూ రిలీజ్‌ డేట్‌ టీజర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి:

‘జిమ్ జిమ్ తార’ సాంగ్.. కాంట్రవర్సీలో ‘ఆదర్శ కుటుంబం’

సమంతకు కవల పిల్లలా.. ఆ హీరోయిన్ అలా కామెంట్‌ చేశారేంటి?

బాలయ్య, కొరటాల సినిమా... ఆ రూమర్స్ నమ్మొద్దంటోన్న టీమ్

Updated at - Oct 31 , 2026 | 02:41 PM