సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

టార్గెట్ యూత్.. ‘వాలా 2’ తెలుగు ట్రైలర్ ఎలా ఉందంటే?

ABN, Publish Date - Apr 20 , 2026 | 08:24 PM

కేరళ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసిన మలయాళ సంచలన చిత్రం ‘వాలా 2’. ఇప్పుడీ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.

కేరళ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసిన మలయాళ సంచలన చిత్రం ‘వాలా 2’ (Vaazha 2). ఇప్పుడీ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. సావిన్ SA దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హషీర్ హెచ్, అలన్ బిన్ సిరాజ్, అజిన్ జాయ్, వినాయక్ వి వంటి యువ నటీనటులు నటించారు. వీరి నటనకు ప్రేక్షకుల నుండి విశేష ప్రశంసలు లభించాయి. తెలుగు నిర్మాత సాహు గారపాటి తన షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై.. విపిన్ దాస్, హారిస్ దేశం, P.B. అనిష్, ఆదర్శ్ నారాయణ్, ఐకాన్ స్టూడియోస్‌తో కలిసి ఈ సినిమాను నిర్మించారు. మలయాళంలో ఇప్పటికే 200 కోట్టు రాబట్టిన ఈ చిత్ర తెలుగు వెర్షన్ విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో నేచురల్ స్టార్ నాని సోషల్ మీడియా వేదికగా థియేట్రికల్ ట్రైలర్‌ (Vaazha 2 Telugu Trailer)ను విడుదల చేశారు.

‘వాలా’కు సీక్వెల్ కథ‌గా ఈ మూవీ రూపొందింది. అందులోని మెయిన్ గ్యాంగ్ జీవితాలను ప్రజెంట్ చేసింది. కాలేజ్ జీవితం, మారుతున్న స్నేహాలు, అనూహ్య మలుపులతో సరదాగా ఈ సినిమా ఉంటుందనే విషయం ఈ ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. ఇలా సరదాగా సాగుతూనే, ఒక్కసారిగా ఎమోషనల్‌గా మారింది. చివరిలో మంచి మెసేజ్ కూడా ఈ సినిమా ఇవ్వబోతుందనేది ఈ ట్రైలర్ క్లారిటీ ఇచ్చేస్తోంది. మొత్తంగా ఈ ట్రైలర్.. కామెడీ, భావోద్వేగ క్షణాలు కలగలిపిన కథతో పాటు, నాస్టాల్జియా మూమెంట్స్‌తో ‘వాలా 2’ ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తోంది. యూత్ ఫుల్ ఎలిమెంట్స్, ఎమోషనల్ మూమెంట్స్‌తో రాబోతున్న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తుందని చెప్పొచ్చు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 24న థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

అప్పటి వరకూ నాకు విశ్రాంతి లేదు: పవన్ కళ్యాణ్ విష్‌కు చంద్రబాబు స్పందనిదే!

సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలి సినిమాల్లోకి వచ్చిన సెలబ్రిటీలు వీరే!

సబ్‌స్క్రిప్షన్ వార్తలపై అనన్య నాగళ్ల క్లారిటీ ఇదే!

Updated Date - Apr 20 , 2026 | 08:24 PM