శివన్నలో మరో యాంగిల్.. ఆసక్తికరంగా ‘కూర్మ అవతార్‌’ టీజర్ 

ABN, Publish Date - Sep 01 , 2026 | 07:09 AM

ప్రముఖ కన్నడ నటుడు శివరాజ్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం  ‘కూర్మ అవతార్‌’.  హర్షవర్ధన్‌ కడియాల దర్శకత్వం వహిస్తున్నారు.

ప్రముఖ కన్నడ నటుడు శివరాజ్‌ కుమార్‌ (Shivaraj kumar) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం  ‘కూర్మ అవతార్‌’ (Kurma avatar).  హర్షవర్ధన్‌ కడియాల దర్శకత్వం వహిస్తున్నారు. వరలక్ష్మీ శరత్‌కుమార్‌, సాయికుమార్‌, రాజ్‌ తరుణ్‌, శివాజీ, అతిరా రాజ్‌, పూజిత కె. తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కె.సేవిత, పూజిత కె. నిర్మాతలు. సోమవారం హైదరాబాద్‌లో ‘కూర్మ అవతార్‌’ టీజర్‌ను ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి  దిల్‌రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీజర్‌ను వీక్షించిన అనంతరం ఆయన చిత్రబృందాన్ని అభినందించారు. దర్శకుడు హర్ష తనదైన విజన్‌తో సినిమాను రూపొందించినట్లు టీజర్‌ చూస్తేనే అర్థమవుతోందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా శివరాజ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. తెలుగులో బాలకృష్ణ నటించిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’, ఇటీవల వచ్చిన ‘పెద్ది’ చిత్రాల్లో మంచి పాత్రలు దక్కాయి.  దర్శకుడు హర్ష ‘కూర్మ అవతార్‌’ కథను చెప్పగానే ఎంతో నచ్చి ఈ సినిమా చేస్తున్నా. కథ నచ్చితే దర్శకుడు కొత్తవారా, అనుభవం ఉన్నవారా అనే విషయాన్ని నేను పెద్దగా పట్టించుకోను. మంచి కథ అయితే తప్పకుండా చేయడానికి ముందుకొస్తా. హర్ష ఎంతో గొప్ప విజన్‌తో ‘కూర్మ అవతార్‌’ను తెరకెక్కించారు. ఈ సినిమా నాకు ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చింది. సాయికుమార్‌తో కలిసి గతంలో ఎన్నో సినిమాలు చేశాను. మరోసారి ఆయనతో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది’’ అని శివరాజ్‌ కుమార్‌ అన్నారు.

సాయికుమార్‌ మాట్లాడుతూ 'శివరాజ్‌ కుమార్‌ కుటుంబంతో ఎంతోకాలంగా అనుబంధం ఉంది. ఆయన కుటుంబ సభ్యులు మంచి మనసున్న వారు.  శివరాజ్‌ కుమార్‌తో కలిసి ఇప్పటికే పలు చిత్రాల్లో నటించాను.  ‘కూర్మ అవతార్‌’లో మరోసారి కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది' అన్నారు. 

 ALSO READ:

నన్ను కూడా మీ గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తున్నందుకు థ్యాంక్స్: దుల్కర్

బాలయ్యతో ‘ఇరుముడి’ దర్శకుడు నిజమేనా..

నిర్మాత సి. కల్యాణ్ కుమారుడి వెడ్డింగ్ రిసెప్షన్‌లో ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్ రాధాకృష్ణ

Updated at - Sep 01 , 2026 | 08:07 AM