‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. ఈసారి జంబలకిడి పంబే!
ABN, Publish Date - May 30 , 2026 | 09:32 PM
‘సేవ్ ది టైగర్స్’ వెబ్ సిరీస్ సీజన్ 3 (Save The Tigers 3) వచ్చేందుకు అంతా సిద్ధమైంది. జియో హాట్ స్టార్ ఓటీటీలో ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకుని, బ్లాక్ బస్టర్ ఆదరణను పొందిన ఈ సిరీస్ మూడో సీజన్ ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు.
‘సేవ్ ది టైగర్స్’ వెబ్ సిరీస్ సీజన్ 3 (Save The Tigers 3) వచ్చేందుకు అంతా సిద్ధమైంది. జియో హాట్ స్టార్ ఓటీటీలో ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకుని, బ్లాక్ బస్టర్ ఆదరణను పొందిన ఈ సిరీస్ మూడో సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతగానో వేచి చూస్తున్నారు. వారి ఎదురు చూపులకు బ్రేక్ వేసేందుకు ఈ సీజన్ 3 జూన్ 19 నుంచి జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. సీజన్ 3 ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ శనివారం ట్రైలర్ (Save The Tigers 3 Trailer)ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్రైలర్‌ని గమనిస్తే..
‘‘ఎవరన్నా.. చిన్నప్పటి నుంచి పెళ్లి గురించి మనకు ఇన్ని అబద్దాలు చెప్పింది.. పెళ్లి అంటే పండు వెన్నెల, పెళ్లాం అంటే నిండు పున్నమి’’ అనే రాహుల్ పాత్రలో అభినవ్ గోమటం చెప్పే డైలాగ్‌తో ఈ ట్రైలర్ మొదలైంది. బార్‌లో రాహుల్ (అభినవ్ గోమటం), విక్రమ్ (కృష్ణ చైతన్య), ఘంటా రవి (ప్రియదర్శి) ముగ్గురూ కలిసి పెళ్లి గురించి, జీవితం గురించి మాట్లాడుకుంటూ.. ‘మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్’ అని ఎవడు అన్నాడో నాకు దొరికితేనా? అని విక్రమ్ (కృష్ణ చైతన్య) అనడంతో స్వర్గంలో ఇంద్రుడి పాత్రలో వెన్నెల కిషోర్ ప్రత్యక్షమయ్యారు. వెన్నెల కిషోర్ ఎంట్రీతో కథ వేరే ట్రాక్ ఎక్కుతుంది. ఘంటా రవి ఎమ్మెల్యేగా.. రాహుల్ గొప్ప స్క్రీన్‌ప్లే రైటర్‌గా.. విక్రమ్ ఓ పెద్ద కంపెనీకి సీఈవో సెట్టవుతారు. అసలు తమ జీవితంలో ఏం జరుగుతుందో తమకే అర్థం కాని విధంగా వారి లైఫ్‌లు నడుస్తుంటాయి. ఈసారి ఏకంగా ఇంద్రుడు అండ్ టీమ్ భూలోకం వచ్చి.. వారితో ఓ ఆట ఆడుకుంటున్నట్లుగా ఈ ట్రైలర్‌లో చూపించారు. ‘జంబలకిడి పంబ’ తరహాలో ఈసారి ఈ సిరీస్ ఉండబోతుందనేది ఈ ట్రైలర్ చూస్తుంటే స్పష్టమవుతోంది. డైలాగ్స్ కూడా బాగా పేలాయి.
దేవియాని శర్మ, పావని గంగిరెడ్డి, జోర్దార్ సుజాత, రోహిణి ఇలా అందరూ తమ తమ పాత్రలతో మరోసారి ఆడియెన్స్‌ను ఆకట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నారనే హింట్ ఇస్తూ వచ్చిన ఈ ట్రైలర్.. ఎంటర్‌టైన్‌మెంట్‌కి లోటుండదనే హింట్ ఇచ్చేస్తోంది. ఫాంటసీ అంశాలతో రిలేషన్ షిప్ డ్రామాను మిక్స్ చేసి మూడో సీజన్‌ను వినోదభరితంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. చూద్దాం మరి.. ఈ సీజన్ 3 ఎలాంటి ఆదరణను రాబట్టుకుంటుందో..
ఇవి కూడా చదవండి:
రకుల్‌ని మోసం చేసిన అక్షయ్ కుమార్.. వీడియో చూశారా!
చీరకట్టులో ‘బిగ్‌బాస్’ బ్యూటీ శోభా శెట్టి.. సోషల్ మీడియా షేక్!
అరుదైన పిక్.. సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘కండక్టర్’ ఐడీ కార్డ్!