సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Rapid Chitram: సినీ సమాచార చిత్రమాలిక ర్యాపిడ్‌ చిత్రం

ABN, Publish Date - Aug 15 , 2026 | 03:29 PM

సినీ ఇండస్ట్రీలో ఏ మూల ఏం జరుగుతుందో తెలిపే సమాచార మాలిక ‘ర్యాపిడ్‌ చిత్రం’. టాలీవుడ్ టు హాలీవుడ్ ఫిల్మ్ అప్డేట్స్ ఇందులో చూడొచ్చు. ఆలస్యమెందుకు వీడియో చూసేయండిక!

విక్టరీ వెంకటేశ్ సినీ ప్రయాణం 40 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఫ్యాన్స్ కు అనిల్ రావిపూడి అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు. వీరి క్రేజీ కాంబోలో వస్తున్న సినిమా నుంచి వెంకటేశ్ ఫస్ట్ లుక్‌ను రివీల్ చేశారు. ‘లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డి’గా పవర్ ఫుల్ రోల్‌లో ఇందులో వెంకీ కనిపించనున్నారు. శర్వానంద్, శ్రీను వైట్ల కొత్త సినిమా సినీ ప్రముఖుల మధ్య ప్రారంభమైంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌‌కు ‘జార్జ్ క్రిష్’ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. సురేశ్ బాబు కెమెరా స్విచ్ఛాన్ చేయగా.. తలసాని శ్రీనివాస్ యాదవ్ క్లాప్ కొట్టారు. హవీష్, కావ్య థాపర్ జంటగా త్రినాథ్ రావు నక్కిన తెరకెక్కిస్తోన్న ‘నేను రెడీ’ చిత్రం నుంచి ‘మస్తుగుందిరా యవ్వారం’ పాట విడుదలైంది. మిక్కీ జె మేయర్ స్వరపరిచిన ఈ పాటను కాసర్ల శ్యామ్ రాయగా, అనురాగ్ కులకర్ణి, మనీషా పాడారు. అశోక్ గల్లా, శ్రీగౌరీ ప్రియ జంటగా నటిస్తోన్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘వీసా’ నుంచి రెండో టీజర్ విడుదలైంది. ఉద్భవ్ రఘు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం అక్టోబర్ 17న విడుదల కానుంది.. ఇంకా ఇలాంటి సినీ విశేషాల కోసం పై ర్యాపిడ్ చిత్రం చూసేయండి.

ఇవి కూడా చదవండి:

నా మాటలను వక్రీకరించారు: ట్రోలింగ్‌పై అనసూయ సంచలన పోస్ట్

‘జార్జ్ క్రిష్’.. శ్రీను వైట్లకు శర్వానంద్ అయినా హిట్ ఇస్తాడా

మహేష్ బాబు కాదా.. బుచ్చిబాబు నెక్ట్స్ ప్రాజెక్ట్ మెగాస్టార్‌తోనా?

Updated Date - Aug 15 , 2026 | 03:29 PM