Rapid Chitram: సంక్షిప్తంగా సినీ విశేషాలు ర్యాపిడ్ చిత్రం
ABN, Publish Date - Jul 16 , 2026 | 03:37 PM
తెలుగు సినిమా సమాచారంతో పాటు భారతీయ ప్రధాన భాషల సినిమా విశేషాలను అందించే న్యూస్ బులిటెన్ ర్యాపిడ్ చిత్రం. హాలీవుడ్, ఓటీటీ విశేషాలనూ ఇందులో సంక్షిప్తంగా వీక్షించొచ్చు.
‘రంగస్థలం’ తర్వాత సుకుమార్, రామ్ చరణ్ కాంబోలో రానున్న ‘ఆర్సీ17’లో నయనతార నటిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీని సుక్కూ తెరకెక్కిస్తున్నట్లు వినికిడి. జగపతిబాబు, లయ నటించిన ‘వదలా’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఆకెళ్ళ వి కృష్ణ తెరకెక్కిస్తోన్న ఈ మూవీ జూలై 17న విడుదల కానుంది. హీరో కిరణ్ అబ్బవరం బర్త్‌డే సందర్భంగా బుధవారం ‘చెన్నై లవ్ స్టోరీ’లోని క్యారెక్టర్‌ను రివీల్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో కిరణ్ ‘స్టీవెన్ శంకర్’ రోల్‌లో కనిపించనున్నారు. సాయిదుర్గ తేజ్, రోహిత్ కేపీ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న ‘సంబరాల ఏటి గట్టు’ షూటింగ్ చివరి దశకు చేరింది. హైదరాబాద్‌లో సంజయ్ దత్, తేజ్ మధ్య హై-వోల్టేజ్ క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. విజయ్ దళపతి ,హెచ్ వినోద్ కాంబోలో రానున్న ‘జననాయగన్’ ఎట్టకేలకు రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా ఈ నెల 23న విడుదల కానుంది.. ఇంకా ఇలాంటి మరిన్ని సినీ విశేషాల కోసం పై ర్యాపిడ్ చిత్రం చూసేయండి.
ఇవి కూడా చదవండి:
బాలయ్య బిడ్డ తేజస్విని డ్యాన్స్‌ల వెనుక మతలబు ఏంటి? హీరోయిన్‌గా ఏమైనా..
KA13: కిరణ్ అబ్బవరం పుట్టినరోజు స్పెషల్‌గా క్రేజీ మేకింగ్ వీడియో
మరోసారి దిల్ రాజు వర్సెస్ మైత్రీ.. దేవుడిపై భారం వేసిన ఎస్కేఎన్