'వదలా' నుంచి వచ్చిన మెలోడీ సాంగ్
ABN, Publish Date - May 27 , 2026 | 02:40 PM
జగపతిబాబు, లయ జంటగా నటించిన 'వదలా' చిత్రం నుండి ఓ మెలోడీ సాంగ్ తాజాగా విడుదలైంది. ఈ చిత్రానికి ఆకెళ్ళ వి కృష్ణ దర్శకత్వం వహించారు.
జగపతిబాబు, లయ, హృతికా శ్రీనివాస్ కీలక పాత్రలు పోషించి సినిమా 'వదలా'. ఆకెళ్ళ వి కృష్ణ దర్శకత్వంలో కిషోర్ నాయుడు చిరుమలమిల్ల, తమ్మారెడ్డి భరద్వాజ దీనిని నిర్మించారు. అతి త్వరలో జనం ముందుకు రాబోతున్న ఈ సినిమా నుండి తాజాగా 'ఆ నింగీ ఈ నేల' అనే ఫ్యామిలీ మెలోడీ సాంగ్ విడుదలైంది. కృష్ణవేణి మల్లవజ్జల అందించిన సాహిత్యం పాటకు ప్రాణం పోయగా, కార్తీక్ కొడకండ్ల స్వీయ స్వర కల్పనలో ఈ పాటను పాడాడు. ఈ చిత్రానికి చోటా కె నాయుడు డీవోపీ, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్, లక్ష్మీ భూపాల రైటర్.
ఇవి కూడా చదవండి:
మళ్లీ కత్తిలా తయారైన కాజల్.. ఈ గ్లామర్ ఫొటోలు చూశారా!
System Movie Review: సోనాక్షి సిన్హా, జ్యోతిక 'సిస్టమ్' ఓటీటీ మూవీ రివ్యూ
హరిరామజోగయ్య కుమారుడిపై గేయ రచయిత అనంత శ్రీరామ్ ఫిర్యాదు