సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘మండాడి’ టీజర్.. నెక్ట్స్ లెవెల్ అంతే!

ABN, Publish Date - Aug 26 , 2026 | 09:15 PM

వైవిధ్యభరితమైన నటనతో ఆకట్టుకుంటోన్న సుహాస్, కోలీవుడ్ స్టార్ సూరి ప్రధాన పాత్రల్లో ఎల్రెడ్ కుమార్ సమర్పణలో, ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్‌పై మతిమారన్ పుగళేంది దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘మండాడి’. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలైంది.

వైవిధ్యభరితమైన నటనతో ఆకట్టుకుంటోన్న సుహాస్ (Suhas), కోలీవుడ్ స్టార్ సూరి (Soori) ప్రధాన పాత్రల్లో ఎల్రెడ్ కుమార్ సమర్పణలో, ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్‌పై మతిమారన్ పుగళేంది దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘మండాడి’. ఎల్రెడ్ కుమార్ నిర్మిస్తోన్న ఈ భారీ యాక్షన్ డ్రామాలో మహిమా నంబియార్ కథానాయికగా నటిస్తుండగా.. సీనియర్ నటుడు సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి పవర్‌ఫుల్ టీజర్‌ (Mandaadi Teaser)ను మేకర్స్ విడుదల చేయగా, మంచి స్పందనను రాబట్టుకుంటోంది.

టీజర్‌ను గమనిస్తే.. ‘‘పందెమే మనల్ని కాపాడుతుంది.. పందాన్ని మనం కాపాడట్లేదు’, ‘బరిలోకి దిగే ప్లేయర్స్‌లో నిజాయితీ ఉంటే.. ఈ గాలి, సముద్రం మిమ్మల్ని ఎప్పటికీ ఒగ్గేయదు’ అంటూ సాగే సంభాషణలు రోమాంచితంగా ఉన్నాయి. సముద్రపు తీరంలో సాగే బోట్ రేసింగ్ సీక్వెన్స్‌లు, పడవల పందెంల విజువల్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. సుహాస్, సూరిల ఇంటెన్స్ లుక్స్, పవర్ ఫుల్ ఎంట్రీలు మరింత హైలైట్‌గా నిలిచాయి. దీనికి తోడు జీవీ ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఎస్.ఆర్. కథిర్ సినిమాటోగ్రఫీ టీజర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయి.

భారీ విజువల్స్, ఉద్వేగభరితమైన ఎమోషన్స్, అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్‌తో రూపొందిన ఈ చిత్రంపై టీజర్‌తో అంచనాలు భారీగా పెరిగాయి. పాన్-ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 10న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్‌పి ద్వారా ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.

ఇవి కూడా చదవండి:

Toxic: అయ్యో.. రుక్మిణి వసంత్‌ని అలా వాడేశారేంట్రా

వి.ఎన్. ఆదిత్య క్లాప్‌తో.. సరికొత్త యూత్‌ఫుల్ లవ్ స్టోరీ ప్రారంభం

నా భర్త నా కోరిక తీర్చేశారు: నటి పూర్ణ భావోద్వేగం

Updated Date - Aug 26 , 2026 | 09:15 PM