వి.ఎన్. ఆదిత్య క్లాప్‌తో.. సరికొత్త యూత్‌ఫుల్ లవ్ స్టోరీ ప్రారంభం

ABN , Publish Date - Aug 26 , 2026 | 03:21 PM

యష్ తేజ్, జయశ్రీ హీరో హీరోయిన్లుగా సుజయ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై, ఆర్‌ఎన్ క్రియేషన్స్ సమర్పణలో తెరకెక్కనున్న సరికొత్త యూత్‌ఫుల్ లవ్ స్టోరీ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.

Sujay Productions and RN Creations Film Launch

యష్ తేజ్ (Yash Tej), జయశ్రీ (Jayasri) హీరో హీరోయిన్లుగా సుజయ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై, ఆర్‌ఎన్ క్రియేషన్స్ సమర్పణలో తెరకెక్కనున్న సరికొత్త యూత్‌ఫుల్ లవ్ స్టోరీ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. చందు (Chandu) దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని నిర్మాతలు కె. గోపాల్, జె. రవీందర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ప్రారంభోత్సవ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు వి.ఎన్. ఆదిత్య (VN Aditya) క్లాప్ కొట్టగా, సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ (Tammareddy Bharadwaj) కెమెరా స్విచ్ఛాన్ చేశారు. అనంతరం తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ పూర్వ సంచాలకులు మామిడి హరికృష్ణ స్క్రిప్ట్‌ను చిత్ర యూనిట్‌కు అందజేసి.. సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.


ఈ సందర్భంగా దర్శకుడు చందు మాట్లాడుతూ.. నేటి తరం ప్రేమకథలకు కుటుంబ విలువలను జోడించి ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ప్రేమలో ఉన్న యువతీయువకులు తమ తల్లిదండ్రుల భావోద్వేగాలను, బాధ్యతలను దృష్టిలో ఉంచుకుంటే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? పేరెంట్స్ గురించి వారు ఎలా ఆలోచిస్తారు? అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. సరికొత్త అనుభూతిని పంచే అందమైన ప్రేమకథను ప్రేక్షకులకు అందించబోతున్నందుకు సంతోషంగా ఉందని నిర్మాతలు కె. గోపాల్, జె. రవీందర్ వ్యక్తం చేశారు.


Sujay Productions Film Launch

ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్‌గా భూపతి యాదగిరి, సంగీత దర్శకుడిగా నాగ వంశీ, సినిమాటోగ్రాఫర్లుగా నాని బిశెట్టి, సురేష్ జిల్లా వ్యవహరిస్తుండగా.. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఎర్రం రామకృష్ణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని, పూర్తి వివరాలను మరో అప్డేట్‌లో ప్రకటిస్తామని మేకర్స్ ఈ సందర్భంగా తెలియజేశారు.

ఇవి కూడా చదవండి:

నా భర్త నా కోరిక తీర్చేశారు: నటి పూర్ణ భావోద్వేగం

గొప్ప మనసు చాటుకున్న వినోద్ కుమార్.. ఏం చేశారంటే

‘ఇరుముడి’పై రామ్ చరణ్ ట్వీట్.. వాట్టే టైమింగ్

Updated Date - Aug 26 , 2026 | 03:21 PM