‘ఇట్లు అర్జున’ మూవీ ‘హాయ్ రే’ సాంగ్ ఎలా ఉందంటే?

ABN, Publish Date - May 28 , 2026 | 11:55 PM

డైరెక్టర్ వెంకీ కుడుముల తన నిర్మాణ సంస్థ వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న మొట్టమొదటి చిత్రం ‘ఇట్లు అర్జున’. ఈ మూవీ ఫస్ట్ సింగిల్‌ని మేకర్స్ విడుదల చేశారు.

డైరెక్టర్ వెంకీ కుడుముల తన నిర్మాణ సంస్థ వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న మొట్టమొదటి చిత్రం ‘ఇట్లు అర్జున’ (Itlu Arjuna). ‘న్యూ గై ఇన్ టౌన్’ అనీష్ (Aniesh) హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాకు మహేష్ ఉప్పల దర్శకుడు. దర్శకుడికి కూడా ఇదే మొదటి చిత్రం. అనీష్ సరసన అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్ర టైటిల్ గ్లింప్స్‌.. ఇప్పటికే సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ సింగిల్‌ ‘హాయ్ రే’ను నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) ద్వారా మేకర్స్ రిలీజ్ చేయించారు. ఈ పాట ప్రోమో విషయంలో థమన్, అనిరుధ్ కలిసి.. బండోడు, బక్కోడు అంటూ హడావుడి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడొచ్చిన పూర్తి సాంగ్ ఎలా ఉందంటే..


యూత్‌ఫుల్ ఎనర్జీతో, క్యాచీ ట్యూన్‌తో వినగానే ఆకట్టుకుంటోందీ సాంగ్. ఎస్. థమన్ (S Thaman) ఈ పాటను స్ట్రాంగ్ ఎలక్ట్రానిక్, హిప్‌హాప్ బీట్స్‌తో ఫాస్ట్ పేస్డ్ రిథమ్ నంబర్‌గా కంపోజ్ చేసిన తీరు ఆసక్తిని రేకెత్తిస్తోంది. ట్రెండీ రిథమ్స్‌తో పాటు క్లాసికల్ టచ్, బ్రైట్ ఇన్‌స్ట్రుమెంటేషన్ పాటకు మోడ్రన్, సోల్‌ఫుల్ ఫీల్ తీసుకొచ్చాయి. అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) ఎనర్జిటిక్ వోకల్స్‌ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాఫ్ట్ ఎమోషన్స్ నుంచి హై ఎనర్జీ హుక్స్ వరకు ఆయన వాయిస్... పాట మూడ్‌ను మరింత ఎలివేట్ చేయడంతో.. విడుదలైన కాసేపటికే ఈ సాంగ్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. కళ్యాణ్ చక్రవర్తి ఈ పాటకు సాహిత్యం అందించారు. హార్ట్‌ఫుల్‌గా ఉండి హీరోయిన్‌ను దూరం నుంచి ప్రేమించే హీరో భావాలను ఈ సాంగ్ ఎంతో అందంగా వ్యక్తపరిచింది. ఈ పాటతో మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్స్‌ని స్టార్ట్ చేశారు. త్వరలోనే మరిన్ని అప్డేట్స్‌ని వదిలేందుకు మేకర్స్ సన్నద్ధమవుతున్నారు.

ఇవి కూడా చదవండి:

ఆడియో జ్యూక్ బాక్స్ విడుదల.. ‘పెద్ది’ టీమ్ తప్పు చేసిందా?

యూపీ‌లో పౌల్ట్రీ బిజినెస్.. భూమి పూజతోనే బండ్ల గణేష్ పరార్.. ఎందుకంటే?

‘అమ్మ’కు ఏమైంది? మరో సీనియర్ నటి సంచలన ఆరోపణలు!

Updated at - May 28 , 2026 | 11:55 PM