Hanuman Ansh: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్
ABN, Publish Date - Oct 05 , 2026 | 05:28 PM
చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టైన ‘హనుమాన్ అంశ్’ సినిమా తెలుగులో రాబోతుంది. ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు
‘హనుమాన్ అంశ్’(Hanuman ansh) ఈ మధ్య కాలంలో విపరీతంగా వార్తల్లో నిలిచిన చిత్రం. విశాల్ చతుర్వేది (Vishal Chaturvedi) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శోభిత్ శ్రీవాత్సవ ప్రధాన పాత్ర పోషించారు. పూర్ణిమ తివారి, చందన్ ఆనంద్ కీలక పాత్రల్లో నటించారు. చిన్న సినిమాగా, ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డులు సృష్టించింది. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా గురించి ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారు. ఆ సమయం రానే వచ్చింది. అక్టోబరు 9న హనుమాన్ అంశ్ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని థియేటర్స్‌లో విడుదల చేయనుంది. ఈ సందర్భంగా సోమవారం మేకర్స్ తెలుగు ట్రైలర్ విడుదల చేశారు. తెలుగు ప్రేక్షకులను ఈ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
ఇవి కూడా చదవండి:
అలాంటి కొటేషన్స్ వేసి.. ఇలా తగ్గావ్ ఏంటి బండ్లన్నా?
నర్తకిగా పూజిత పొన్నాడ.. ఫస్ట్ లుక్ అదిరింది
నాపై ఐటీ దాడులా.. అసలు నిజాలు తెలుసుకోరా?: రకుల్ ప్రీత్ సింగ్