అలాంటి కొటేషన్స్ వేసి.. ఇలా తగ్గావ్ ఏంటి బండ్లన్నా?

ABN , Publish Date - Oct 05 , 2026 | 05:42 PM

ఆ మధ్య కుమార్తె పెళ్లితో ఒక్కసారిగా వైరల్ అయిన బండ్ల గణేష్.. ఆ తర్వాత పబ్లిక్ ప్లేస్‌లలో పెద్దగా కనిపించకపోయినప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం యమా యాక్టివ్‌గా ఉంటూనే ఉన్నారు. తాజాగా ఆయన ఓ విజ్ఞప్తి చేశారు.

Bandla Ganesh

బండ్ల గణేష్ ఈ పేరు ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తోంది. ఆ మధ్య కుమార్తె పెళ్లితో ఒక్కసారిగా వైరల్ అయిన బండ్ల గణేష్.. ఆ తర్వాత పబ్లిక్ ప్లేస్‌లలో పెద్దగా కనిపించకపోయినప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం యమా యాక్టివ్‌గా ఉంటూనే ఉన్నారు. తనకు ఆత్మీయులైన వారి బర్త్‌డే‌లకు శుభాకాంక్షలు చెప్పడంతో పాటు.. తనని టార్గెట్ చేసే వారికి కొటేషన్స్‌తో కౌంటర్స్ ఇస్తూ వస్తున్నారు. మరి ఏమైందో ఏమో తెలియదు కానీ, తాజాగా బండ్ల గణేష్ (Bandla Ganesh) వెనక్కి తగ్గారు. ‘దయచేసి మీ టైమ్‌పాస్ కోసం నా పేరు వాడి, నా జీవితానికి అన్యాయం చేయొద్దని చేతులెత్తి నమస్కరిస్తున్నాను’ అని బండ్ల గణేష్ చేసిన తాజా ఎక్స్ పోస్ట్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.


అంతకు ముందు వరసపెట్టి కొటేషన్స్ వేస్తూ.. వార్నింగ్స్ ఇచ్చిన బండ్లన్న ఒక్కసారిగా ఇలా ఎందుకు తగ్గాడు? అంటూ నెటిజన్లు, అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ‘‘నా మౌనాన్ని బలహీనత అనుకోవద్దు స్వామి.. సమయం కోసం ఆగుతున్నాను. సమాధానం మాత్రం జీవితాంతం గుర్తుండిపోయేలా ఉంటుంది’’, ‘‘దారి ఎంత కఠినమైనదైనా దాటే ధైర్యం నాది. ఎలాంటి పరిస్థితుల్లోనూ కుంగిపోకుండా నిలబడే పట్టుదల నాది. ఈ రోజు కాకపోయినా, రేపు విజయం నాదేనన్న నమ్మకం నాది. నిజాయితీ నా బలం… నమ్మకం నా ఆయుధం… విజయం వరకు పోరాటమే నా ప్రయాణం!’’ అంటూ బండ్ల గణేష్ ఒక్కొక్కరికి వార్నింగ్స్ ఇచ్చినంత పని చేశారు. ఇప్పుడేమో దండం పెట్టేశారు. తాజాగా ఆయన చేసిన పోస్ట్ విషయానికి వస్తే..


‘‘దయచేసి మీ టైమ్‌పాస్ కోసం నా పేరు వాడి, నా జీవితానికి అన్యాయం చేయొద్దని చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నాకు ఎలాంటి పదవుల మీద, హోదాల మీద, మరే విషయాల మీదా ఎలాంటి వ్యామోహం కానీ, ఆశ కానీ లేదు. లేనిపోని విషయాలు మాట్లాడి నా పేరును ఉపయోగించి నాకు ఇబ్బందులు కలిగించొద్దని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి నా పరిస్థితిని అర్థం చేసుకుని, నా పేరు ఉపయోగించకుండా, నాకు ఎలాంటి ఇబ్బందులు కలిగించొద్దని చేతులెత్తి నమస్కరిస్తున్నాను’’ అంటూ బండ్ల గణేష్ వేడుకుంటూ, విజ్ఞప్తి చేయడంతో.. ‘బండ్లన్నా.. ఏమైందన్నా?’ అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరు ‘బాగా అయింది.. నీకు ఇలానే ఉండాలి’ అంటూ కామెంట్స్ చేస్తుండటం విశేషం.

ఇవి కూడా చదవండి:

నర్తకిగా పూజిత పొన్నాడ.. ఫస్ట్ లుక్ అదిరింది

నాపై ఐటీ దాడులా.. అసలు నిజాలు తెలుసుకోరా?: రకుల్ ప్రీత్ సింగ్

‘చుట్టమల్లే’ మార్ఫింగ్ వీడియోపై జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్

Updated Date - Oct 05 , 2026 | 05:42 PM