సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

శ్రీవిష్ణు విడుదల చేసిన 'ఏ నిమిషానికి ఏమి జరుగునో' మూవీ సాంగ్‌

ABN, Publish Date - Sep 16 , 2026 | 02:36 PM

అఖిల్‌ రాజ్, రతిక జంటగా నటించిన సినిమా 'ఏ నిమిషానికి ఏమి జరుగునో'. అక్టోబర్‌ 2 న రాబోతున్న ఈ సినిమా నుంచి తాజాగా 'ఏదో బాగుందే' అనే పాట విడుదలైంది.

'రాజు వెడ్స్‌ రాంబాయ్‌' చిత్రంతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అఖిల్‌ రాజ్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'ఏ నిమిషానికి ఏమి జరుగునో'. ఒక విభిన్నమైన సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రతిక హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సాయితేజ దర్శకుడు. లక్కీ మీడియా, కేడీ అండ్‌ కో బ్యానర్స్‌పై బెక్కెం వేణుగోపాల్‌, దీవెల శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణనంతర పనులు జరుపుకుంటోన్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. కాగా ఈ చిత్రం నుంచి కృష్ణకాంత్‌ రచించిన 'ఏదో బాగుందే' అనే లిరికల్‌ వీడియోను ప్రముఖ యువ కథానాయకుడు శ్రీవిష్ణు విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీ విష్ణు మాట్లాడుతూ 'సాంగ్‌ చాలా ఫ్రెష్‌గా ఉంది. విజువల్స్‌ బాగున్నాయి. సాంగ్‌ అందరికి నచ్చుతుంది. సంగీత దర్శకుడు శశాంక్‌ మంచి ట్యూన్‌ అందించాడు. ఈ సినిమా టైటిల్‌తో సహా అన్ని బాగున్నాయి. టైమ్‌ లూప్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందించారని తెలిసింది. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. తప్పకుండా ఈ సినిమా విజయం సాధించి ఈ సినిమాకు పనిచేసిన అందరికి మంచి పేరు తీసుకరావాలని కోరుకుంటున్నాను' అన్నారు. ఈ సినిమా అక్టోబర్‌ 2న విడుదల కాబోతోంది.

ఇవి కూడా చదవండి:

కత్రీనా పని అయిపోయింది.. పూర్తిగా ఆంటీలా మారిపోయింది

అబ్బా.. భాగ్యశ్రీ అందం.. రామ్ అన్నా ఎక్కడో మచ్చేసుకోని పుట్టాడురా

కావ్య - కాలభైరవ పెళ్లి డేట్ ఫిక్స్..

Updated Date - Sep 16 , 2026 | 02:50 PM