అబ్బా.. భాగ్యశ్రీ అందం.. రామ్ అన్నా ఎక్కడో మచ్చేసుకోని పుట్టాడురా
ABN , Publish Date - Sep 15 , 2026 | 08:51 PM
సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న క్రేజీ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. లెనిన్ తో ఈ చిన్నది భారీ విజయాన్ని అందుకుంది.
సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న క్రేజీ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse ). లెనిన్ తో ఈ చిన్నది భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోయిన్ రేసులో భాగ్యశ్రీ మొదటి స్థానాన్ని ఆక్రమించే పనిలో ఉంది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే అమ్మది అందానికి ఫిధా కానీ వారుండరు అంటే అతిశయోక్తి కాదు. ఇటీవల జరిగిన ప్రతిష్టాత్మక సైమా 2026(SIIMA 2026) అవార్డుల ప్రదానోత్సవంలో భాగ్యశ్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దుల్కర్ సల్మాన్ సరసన నటించిన కాంత చిత్రంలో కుమారి పాత్రలో కనబరిచిన అద్భుత నటనకు గానూ ఆమె బెస్ట్ యాక్ట్రెస్ (క్రిటిక్స్) కేటగిరీలో ఈ పురస్కారాన్ని దక్కించుకుంది. ట్రోఫీతో పాటు రెడ్ కార్పెట్‌పై ఆమె ఇచ్చిన గ్లామరస్ పోజులు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
సైమా వేడుకల కోసం భాగ్యశ్రీ ఎంచుకున్న రాయల్ మెరూన్ కలర్ అవుట్‌ఫిట్ విజువల్ ట్రీట్‌లా నిలిచింది. వెల్వెట్, శాటిన్ మిశ్రమంతో రూపుదిద్దుకున్న ఈ ఆఫ్-షోల్డర్ బాడీ కాన్ గౌన్, ఆమెకు ఎంతో రాయల్, ఎలిగెంట్ లుక్‌ని ఇచ్చింది. గౌన్‌కు ఉన్న డ్రామాటిక్ థై-హై స్లిట్ స్టైల్ ఆమె గ్లామర్ అప్పీల్‌ను మరింత పెంచగా, దానికి తగ్గట్టుగా ధరించిన హై కర్లీ పోనీటైల్, సాఫ్ట్ మేకప్ వేడుకలోనే ప్రధాన హైలైట్‌గా నిలిచాయి. ముఖ్యంగా అమ్మడి ఫేస్ కార్డ్ నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పొచ్చు. ఈ గ్లామరస్ ఫోటోలు చూసిన అభిమానులు రామ్ పొతినేనిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, భాగ్యశ్రీ జంటగా ఆంధ్రా కింగ్ తాలుకా సినిమాలో నటించారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచే వీరిద్దరి ఆన్-స్క్రీన్ అండ్ ఆఫ్-స్క్రీన్ బాండింగ్ అందరి దృష్టినీ ఆకర్షించింది. షూటింగ్ స్పాట్ లోనూ, ఈవెంట్లలోనూ వీరిద్దరూ ఎంతో చొరవగా మెలిగిన విధానం వల్ల రామ్ - భాగ్యశ్రీల మధ్య డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి.
ఒక ఈవెంట్‌లో భాగ్యశ్రీ రామ్‌ను కింగ్ ఆఫ్ హార్ట్స్ అని కాంప్లిమెంట్ ఇవ్వడం, దానికి రామ్ సిగ్గుపడటం లాంటి ముచ్చట్లు వైరల్ కావడంతో ఫ్యాన్ పేజీలు వీరి వీడియోలను ఎడిట్ చేసి న్యూ కపుల్ ఇన్ టౌన్ అంటూ ప్రచారం చేయడం ప్రారంభించాయి. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కినా ఆశ్చర్యం లేదని టాక్. దీంతో భాగ్యశ్రీ అందాన్ని చూసి అబ్బా.. భాగ్యశ్రీ అందం.. రామ్ అన్నా ఎక్కడో మచ్చేసుకోని పుట్టాడురా.. అంటూ సరదాగా కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే భాగ్యశ్రీ ప్రస్తుతం తమిళంలో సేయోన్, మలయాళంలో మోహన్‌లాల్ సరసన ఆపరేషన్ గంగ వంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా మారింది.