సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Kara Teaser: ధనుష్ ‘కర’ టీజర్ ఎలా ఉందంటే?

ABN, Publish Date - Apr 24 , 2026 | 06:36 PM

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, మమితా బైజు జంటగా కుష్మిత గణేష్ సమర్పణలో డా. ఇషారి కె. గణేష్ నిర్మించిన చిత్రం ‘కర’. ఈ మూవీ తెలుగు టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు.

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush), మమితా బైజు (Mamitha Baiju) జంటగా కుష్మిత గణేష్ సమర్పణలో డా. ఇషారి కె. గణేష్ నిర్మించిన చిత్రం ‘కర’ (Kara). విఘ్నేశ్ రాజా (Vignesh Raja) దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ సంయుక్తంగా తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఏప్రిల్ 30న ఈ చిత్రం గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా, శుక్రవారం ఈ చిత్ర తెలుగు టీజర్‌ (Kara Telugu Teaser)ని మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్ ఇంటెన్సివ్‌గానే కాకుండా ఎంతో ఆసక్తికరంగా ఉంది.

ఈ టీజర్‌ని గమనిస్తే.. ‘‘పంటో - గడ్డో, పాపమో - పుణ్యమో.. తను నాటింది తనే నరుక్కోవాలి. నేను నాటిన విత్తనం, ఇప్పుడు కోతకు వచ్చింది. అంతకంటే ముందు నా మీద పడ్డ మచ్చని తుడిచేయాలి. నన్ను నమ్ముకున్న వారిని ముందుకు తీసుకువెళ్లాలి. నా పేరు కర స్వామి. నన్ను అందరూ కర అని పిలుస్తారు’’ అనే డైలాగ్‌తో వచ్చిన ఈ టీజర్ చూస్తుంటే.. ఇదొక సీరియస్, డార్క్ థ్రిల్లర్ సినిమా అని తెలుస్తోంది. ధనుష్ తన లుక్‌, ఎక్స్‌ప్రెషన్స్‌తో ఇందులో సీరియస్‌గా అలాగే, చాలా పవర్ ఫుల్‌గా కనిపిస్తున్నారు. ఆయన పాత్ర చుట్టూ ఏదో ఒక బలమైన ఉద్దేశ్యం, పగ ఉన్నట్లుగా.. ఆయన చెబుతున్న ఈ డైలాగ్ ద్వారా తెలుస్తోంది. ‘పోర్ తొజిల్’ (Por Thozhil) ఫేమ్ విగ్నేష్ రాజా ఓ ఆసక్తికరమైన కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లుగా ఈ టీజర్ క్లారిటీ ఇచ్చేస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన మ్యూజిక్ టీజర్‌లోని ఇంటెన్సిటీని మరింత పెంచింది. ఈ సమ్మర్‌కు ఒక సీరియస్ యాక్షన్ డ్రామా‌గా ‘కర’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి:

తమన్నాతో బ్రేకప్.. మరో యంగ్ బ్యూటీని పట్టిన విజయ్ వర్మ!

పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ట్రెండ్‌లోకి మరో బ్యూటీ! ఇక పరువాల విందే!

ఓటు ఎవరికి వేశాడో.. పబ్లిగ్గా చెప్పేసిన వీటీవీ గణేష్.. వీడియో వైరల్!

Updated Date - Apr 24 , 2026 | 06:36 PM