సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Avengers Doomsday: ‘అవెంజర్స్‌: డూమ్స్‌డే’ ఫైనల్‌ ట్రైలర్‌ వచ్చేసింది

ABN, Publish Date - Nov 23 , 2026 | 11:49 PM

మార్వెల్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘అవెంజర్స్‌: డూమ్స్‌డే’ ఫైనల్‌ ట్రైలర్‌ విడుదలైంది.

మార్వెల్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హాలీవుడ్‌ చిత్రం ‘అవెంజర్స్‌: డూమ్స్‌డే’ (Avengers: Doomsday) ఫైనల్‌ ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో ప్రేక్షకులకు అదిరిపోయే యాక్షన్‌ సన్నివేశాలతో పాటు ఆసక్తికరమైన మలుపులు ఉండనున్నట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది.‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’ తర్వాత మరోసారి సూపర్‌హీరోలంతా ఒకే వేదికపైకి రానుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈసారి అవెంజర్స్‌ బృందానికి విక్టర్‌ వాన్‌ డూమ్‌ రూపంలో శక్తిమంతమైన ప్రత్యర్థి ఎదురుకానున్నాడు. గతంలో ఐరన్‌మ్యాన్‌గా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న రాబర్ట్‌ డౌనీ జూనియర్‌ ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా కనిపించనుండటం విశేషం. థోర్‌, స్టీవ్‌ రోజర్స్‌, రీడ్‌ రిచర్డ్స్‌ సహా పలువురు కీలక పాత్రధారులు ఈ పోరాటంలో భాగం కానున్నారు. అసలు విక్టర్‌ లక్ష్యం ఏమిటి? అతడి వల్ల ప్రపంచానికి ఎలాంటి ముప్పు ఎదురుకానుంది? ఈ ప్రమాదాన్ని అవెంజర్స్‌ ఎలా ఎదుర్కోబోతున్నారు? అన్న అంశాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. డిసెంబరు 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం మార్వెల్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌లో మరో కీలక ఘట్టంగా నిలవనుంది. తాజా ట్రైలర్‌తో అభిమానుల్లో సినిమా హైప్‌ మరింత పెరిగింది.  

ALSO READ:

ఫ్యామిలీ ప్యాక్ టీజర్.. గుర్తింపు కథలు వద్దురా.. బయట చెక్కేస్తున్నారు

లైన్‌లోకి వచ్చిన ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’.. రిలీజ్ ఎప్పుడంటే

భారత్ - పాక్ సైనికులతో.. ‘ది ఇండియన్ బార్డర్’ పోస్టర్ వైరల్

Updated Date - Nov 23 , 2026 | 11:59 PM