సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘అనకాపల్లి’ నుంచి ‘అమ్మోరు దిగినాది’.. ఇక జాతరే!

ABN, Publish Date - Apr 29 , 2026 | 04:12 PM

వైవిధ్యభరితమైన కంటెంట్‌తో పాటు రా అండ్ రస్టిక్‌గా భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్ల మీద కండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మిస్తున్న చిత్రం ‘అనకాపల్లి’. ఈ మూవీ నుంచి జాతర సాంగ్ విడుదలైంది.

వైవిధ్యభరితమైన కంటెంట్‌తో పాటు రా అండ్ రస్టిక్‌గా భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్ల మీద కండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మిస్తున్న చిత్రం ‘అనకాపల్లి’ (Anakapalli). ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కండ్రేగుల కుమార్ రాజా కో-ప్రొడ్యూసర్‌. విక్రమ్ సహిదేవ్ (Vikram Sahidev), సంధ్య వశిష్ట జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లేని అందించడమే కాకుండా త్రినాథరావు నక్కిన ఓ ముఖ్య పాత్రను పోషిస్తుండటం విశేషం. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోగా, తాజాగా ఈ మూవీ నుంచి జాతర సాంగ్‌ను రిలీజ్ చేశారు.

‘అమ్మోరు దిగినాది’ (Ammoru Diginadhi) అంటూ వచ్చిన ఈ పాటలో చాలా కాలం తర్వాత నటి సంగీత క్రిష్ (Sangeetha Krish) కనిపించి, అందరినీ మెస్మరైజ్ చేశారు. ఆమె స్టెప్పులు, గ్రాండియర్‌గా పాటను తెరకెక్కించిన తీరు, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ, మంగ్లీ గాత్రం ఇలా అన్నీ ఈ పాటలో హైలెట్‌గా నిలుస్తున్నాయి. నిజంగానే అమ్మవారి జాతర చూస్తున్నామా? అనే ఫీలింగ్ ఇచ్చే రేంజ్‌లో విజువల్స్ ఉన్నాయంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఇక ఈ పాటకు గణేష్ సలాది లిరిక్స్, దేవ్‌జాంద్ బాణీ మరింత స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మాస్ ఆడియెన్స్‌కి నచ్చే యాక్షన్ సీక్వెన్స్, యూత్‌ మెచ్చే లవ్ ట్రాక్, ఫ్యామిలీ ఆడియెన్స్‌కి కనెక్ట్ అయ్యే ఎమోషనల్ కంటెంట్‌తో ఈ సినిమా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. టాలెంటెడ్ టెక్నీషియన్స్ ఈ సినిమాకు పని చేస్తున్నారని, త్వరలోనే ఈ మూవీని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని మేకర్స్ ఈ అప్డేట్‌లో తెలిపారు. పవర్ ఫుల్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమా కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అవుతుందని చిత్రయూనిట్ నమ్మకంగా చెబుతోంది.

ఇవి కూడా చదవండి:

మంగ్లీపై అసత్య ప్రచారం.. అసభ్యకర పోస్టులు చేస్తున్నారు

Theater Movies: ఈ వారం.. థియేట‌ర్ల‌లో రిలీజ్ అవుతున్న‌ సినిమాలు

చందమామకు సెకండ్ ఇన్నింగ్స్.. సెట్ అవుతుందా


Updated Date - Apr 29 , 2026 | 05:10 PM