‘ఆదర్శ కుటుంబం’లోని ‘మాలా’ లిరికల్ సాంగ్
ABN, Publish Date - Oct 19 , 2026 | 07:19 PM
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రూపొందుతున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47’. ఈ సినిమా నుంచి ‘మాలా’ అంటూ సాగే రెండో పాట విడుదలైంది.
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రూపొందుతున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47’. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘నారాయణమ్మ’ చార్ట్‌బస్టర్‌గా నిలవగా.. తాజాగా మేకర్స్ ‘మాలా’ అంటూ సాగే రెండో పాటను విడుదల చేశారు. ఈ పాటలో వెంకీ సరసన నివేదా పేతురాజ్ తన అందచందాలతో ఆకర్షిస్తున్నారు. మరెందుకు ఆలస్యం.. ఈ పాటను మీరూ చూసేయండి. ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. శ్రీమతి మమత సమర్పిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
‘రౌడీ అల్లుడు’కు 35 ఏళ్ళు.. గీతా ఆర్ట్స్‌లో సంబరాలు
టాలీవుడ్ మేకర్స్‌పై రాహుల్ రామకృష్ణ సెటైరికల్ పోస్ట్
తలైవర్ మ్యాజిక్కే వేరు: ‘జైలర్ 2’ సక్సెస్‌పై నెల్సన్