సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

సైకలాజికల్ థ్రిల్లర్ 'ది మేజ్' నుంచి 'నన్నే నన్నే' సాంగ్‌

ABN, Publish Date - Jul 30 , 2026 | 04:33 PM

శ్రీరామ్‌ హీరోగా నటించిన 'ది మేజ్' మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలైంది. దీనిని యువ కథానాయకుడు ఆనంద్ దేవరకొండ ఆవిష్కరించారు.

తమిళ, తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో శ్రీరామ్ నటిస్తున్న సినిమా 'ది మేజ్'. ప్రియాంక, హ్రితిక శ్రీనివాస్, కమల్ కామరాజు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. డాక్టర్ నైమిష రెడ్డి కసిరెడ్డి సమర్పణలో డాక్టర్ ఉదయ్ కె. రెడ్డి పాల్వాయి, డాక్టర్ కేఎస్ఆర్, డాక్టర్ భరత్ రెడ్డి గోపు, డాక్టర్ అనిరుధ్ రెడ్డి సోమ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. డాక్టర్ రవికిరణ్ గడలాయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌ 'నన్నే.. నన్నే' తాజాగా విడుదలైంది. హీరో ఆనంద్ దేవరకొండ ఈ పాటను విడుదల చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. శ్రవణ్ భరద్వాజ్ కంపోజ్ చేసిన ఈ పాటకు విజయ్ కుమార్ లిరిక్స్ అందించారు. కపిల్ కపిలన్ దీనిని పాడారు. 'నా ప్రాణం నీవే, నా ధ్యానం నీవే, నా మౌన గానం ఇకపై నీవే, నా స్నేహం నీవే, నా మోహం నీవే, నా తీరని దాహం ఇకపై నీవే, నా లోకం నీవై మనసిచ్చావే, మాలోకం గాన్నే మహ మెచ్చావే, నా గుడి దేవతవై ఒకటయ్యావే, ఏడడుగుల ప్రేమే ప్రకటించావే,నన్నే నన్నే మనిషిగా గుర్తించావే, నన్నే నన్నే మార్చేశావే, మన్ను, మిన్ను కలిపేలా పైవాడే, నన్నూ నిన్నూ కలిపాడే..' అంటూ హీరోయిన్ పట్ల హీరో ప్రేమారాధన చూపిస్తూ ఈ పాట సాగింది. వాస్తవం, భ్రమ మధ్య ఉన్న సరిహద్దులను చెరిపేస్తూ, ప్రతి క్షణం ఆలోచనలను సవాల్ చేసే జెయింట్‌ వీల్ ప్రయాణం లాంటి ఉత్కంఠభరితమైన చిత్రం ఇదని మేకర్స్ చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

Spider-Man: Brand New Day Review: స్పైడ‌ర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే రివ్యూ

Srinivasa Mangapuram Review: శ్రీనివాస మంగాపురం రివ్యూ

Updated Date - Jul 30 , 2026 | 04:38 PM