Sonakshi Sinha: సోనాక్షి సిన్హా ‘తు హై మేరీ కిరణ్’.. ట్రైలర్‌లో ట్విస్టులే ట్విస్టులు!
ABN, Publish Date - Oct 06 , 2026 | 08:21 PM
బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా, ఆమె భర్త జహీర్ ఇక్బాల్ కలిసి నటించిన తాజా చిత్రం ‘తు హై మేరీ కిరణ్’.
బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా, ఆమె భర్త జహీర్ ఇక్బాల్ కలిసి నటించిన తాజా చిత్రం ‘తు హై మేరీ కిరణ్’. రొమాన్స్‌తో పాటు థ్రిల్లింగ్ అంశాలను మేళవించి తెరకెక్కించిన ఈ సినిమాకు కరణ్ రావల్ దర్శకత్వం వహిస్తున్నారు. విశాల్ రాణా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై ఆసక్తి నెలకొనగా.. తాజాగా చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. సోనాక్షి, జహీర్ మధ్య ప్రేమ, అనుబంధంతో పాటు వారి జీవితంలో చోటుచేసుకునే అనూహ్య పరిణామాల చుట్టూ కథ సాగనున్నట్లు తెలుస్తోంది. సోనాక్షి పాత్రలోని భావోద్వేగ కోణాన్ని ట్రైలర్‌లో ప్రత్యేకంగా చూపించారు. ప్రేమ, భయం, అనుమానం, ఆందోళన వంటి విభిన్న భావోద్వేగాలతో ఆమె పాత్ర సాగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో అసలు వీరిద్దరి మధ్య ఏం జరుగుతుంది? వారి బంధంలోకి ఎలాంటి సమస్యలు వచ్చాయి? అనే ఆసక్తిని ట్రైలర్ కలిగిస్తోంది. సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ నిజ జీవితంలో భార్యాభర్తలు కావడంతో.. తెరపై కూడా జంటగా కనిపించడం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. వీరిద్దరి కెమిస్ట్రీ ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రొమాంటిక్ సన్నివేశాలతో పాటు సస్పెన్స్, థ్రిల్‌ను మేళవిస్తూ ట్రైలర్‌ను కట్ చేశారు. అక్టోబరు 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read:
Attahaasam: యో.. పుష్పగాడి అన్న కూతురు హీరోయిన్ అయ్యిందిరో
అరేయ్ ఏం బిగ్ బాస్ రా బాబు.. చిరాకొచ్చేస్తుంది
The Traitors Telugu: బిగ్ బాస్ కన్నా వీళ్లే బావున్నారుగా