Immortal Movie: జీవీ ప్రకాశ్ మూవీ నుంచి 'షీ ఈజ్ మై' సాంగ్
ABN, Publish Date - Jul 28 , 2026 | 01:27 PM
జీవీ ప్రకాశ్ కుమార్ తాజా చిత్రం 'ఇమ్మోర్టల్' నుంచి సెకండ్ సింగిల్ విడుదలైంది. సామ్ సి.ఎస్. సంగీతం అందించిన ఈ సినిమాను అరవింద్ శ్రీనివాస్ పాడారు.
ప్రముఖ సంగీత దర్శకుడు, కథానాయకుడు జీవీ ప్రకాశ్ నటిస్తున్న తాజా చిత్రం 'ఇమ్మోర్టల్'. నాకు మరణం లేదు అనేది తెలుగులో ట్యాగ్ లైన్. కయదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను మరియప్పన్ చిన్న దర్శకత్వంలో అరుణ్ కుమార్ ధనశేఖరన్ నిర్మిస్తున్నారు. ఈ డార్క్ ఫాంటసీ సూపర్ నేచులర్ థ్లిల్లర్ సెప్టెంబర్ 4న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా తాజాగా మూవీ నుంచి సెకండ్ సింగిల్ 'షీ ఈజ్ మై..' అనే పాటను మేకర్స్ విడుదల చేశారు. సామ్ సి.ఎస్. స్వరాలు సమకూర్చిన ఈ పాటను రాజశ్రీ సుధాకర్ రాయగా, అరవింద్ శ్రీనివాస పాడారు. ఈ సినిమాలో టీఎం కార్తీక్, కుమార్ నటరాజన్, లొల్లు సభ మారన్, ఆదిత్య కతిర్, అర్షు మహర్జన్, సునీతా శ్రేష్ఠ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
బాక్సాఫీస్ బరిలో.. రెండు కుటుంబాలు.. నలుగురు హీరోలు! విజయం.. ఎవరికి దక్కేనో
ఎన్టీఆర్ భుజానికి గాయం... ఎనిమిది వారాల విశ్రాంతి!