ఎన్టీఆర్ భుజానికి గాయం... ఎనిమిది వారాల విశ్రాంతి!

ABN , Publish Date - Jul 27 , 2026 | 09:32 PM

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) ప్రమాదానికి గురయ్యాడు. ప్రస్తుతం డ్రాగన్ (Dragon) సినిమాలో ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు. తాజాగా ఆయన భుజానికి తీవ్ర గాయమైంది.

NTR

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) ప్రమాదానికి గురయ్యాడు. ప్రస్తుతం డ్రాగన్ (Dragon) సినిమాలో ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు. తాజాగా ఆయన భుజానికి తీవ్ర గాయమైంది. గాయం తీవ్రతను పరిశీలించిన వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించారు. గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి ఎన్టీఆర్‌కు కనీసం 6 నుంచి 8 వారాల పాటు ఖచ్చితమైన విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎన్టీఆర్ టీమ్ స్పష్టం చేస్తూ అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది.


'ఈ రోజు సాయంత్రం దురదృష్టవశాత్తు ఎన్టీఆర్ భుజానికి గాయమయ్యిందని అందరికీ తెలియజేయడానికి మేము విచారిస్తున్నాము. పూర్తి వైద్య పరీక్షల అనంతరం, డాక్టర్ జె. మధుసూదన్ రావు, డాక్టర్ ఆర్. ఎ. పూర్ణచంద్ర తేజస్వి నేతృత్వంలోని వైద్యుల బృందం ఆయన పూర్తిగా కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించింది.ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మేము అందరికీ హామీ ఇవ్వాలనుకుంటున్నాము. ఆయన ఆరోగ్యానికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని సమయానుకూలంగా మీతో పంచుకుంటూ ఉంటాము. మీ మద్దతుకు ధన్యవాదాలు' అంటూ ప్రకటనలో రాసుకొచ్చారు. ఈ వార్తతో నందమూరి అభిమానులు ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

WhatsApp Image 2026-07-27 at 9.13.53 PM.jpeg

Updated Date - Jul 28 , 2026 | 10:29 AM